Janaka Aithe Ganaka : సుహాస్ మూవీ మళ్ళీ వాయిదా… నవ్వు వచ్చే రీజన్ చెప్పారు..

Janaka Aithe Ganaka : టాలెంటెడ్ హీరో సుహాస్ (Suhas) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుండగా, తాజాగా “జనక అయితే గనక” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా నుండి ఇంతకు ముందు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌ లతో మంచి అంచనాలు క్రియేట్ చేయగా, రీసెంట్ గా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయగా నెట్టింట రెస్పాన్స్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 7న సినిమా రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఒక కంప్లీట్ కామెడీ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ సరికొత్త కథనంతో ఫ్రెష్ గా ఉండి ఆకట్టుకోగా, ఇక థియేటర్లలో రెండు రోజుల్లో వచ్చేస్తుంది అనుకునే లోపు అనూహ్యంగా సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

Janaka Aithe Ganaka movie postponed again

వర్షాల మోత.. అందుకే వాయిదానట…

అయితే సెప్టెంబర్ 7న విడుదల కావాల్సిన “జనక అయితే గనక” (Janaka Aithe Ganaka) సినిమాను వాయిదా వేస్తున్నట్టు కాసేపటికిందే మేకర్స్ ప్రకటించారు. ఓ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటిస్తూ… రాష్ట్రంలో ఇప్పుడు వర్షాల మోత.. అందుకే తర్వాత నవ్వుల మోత తో కలుద్దాం.. అంటూ అనౌన్స్ చేస్తూ వాయిదా వేశారు. అయితే కొత్త రిలీజ్ డేట్ ని అయితే ప్రకటించలేదు. కానీ వాయిదా కి కారణం మాత్రం ఇది కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇతర సినిమాలు విడుదల అవడం కంఫర్మ్ అయిపోయాయి. మరి ఆ సినిమాలు వర్షాలు పడితే ఎవరూ చూడరా… ఇలాంటి సిల్లీ రీసన్ చెప్పి వాయిదా వేయడమేంటి అని కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఇంతకు ముందే సుహాస్ జనక అయితే గనక పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.

- Advertisement -

పోటీ కుదరకే వాయిదా?

అయితే ట్రేడ్ వర్గాలు మాత్రం పోటీలో విజయ్ గొట్ (Goat) సినిమా, అలాగే “35 చిన్న కథ కాదు” సినిమా పోటీలో ఉన్నందువల్ల, వాటితో పోటీ పడలేకే వాయిదా వేస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. పైగా సుహాస్ లాస్ట్ రెండు సినిమాలు కూడా ఆశించినంత పెర్ఫర్మ్ చేయలేదు. అందుకే ఈసారి పక్కా ప్లానింగ్ తో సోలోగా ఆడియన్స్ ముందుకు రావాలని చూస్తున్నట్టు సమాచారం. ఇక జనక ఐయితే గనక (Janaka Aithe Ganaka) సినిమా కామెడీయే ప్రధానంగా తెరకెక్కగా, సుహాస్, వెన్నెల కిషోర్‌ ల మధ్య వచ్చే సీన్స్ సినిమాకి హైలెట్ అయ్యేలా ఉన్నాయి. అయితే సినిమా కథలో మెయిన్ పాయింట్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తారా లేదా అన్నది సందేహంగా మారింది. మరి ముందుగా సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు