JanakaAitheGanakaTrailer : కంటెంట్ బాగానే ఉన్నా, జనాలు థియేటర్లకు వస్తారంటారా?

JanakaAitheGanakaTrailer : టాలెంటెడ్ హీరో సుహాస్ (Suhas) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుండగా, తాజాగా “జనక అయితే గనక” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా నుండి ఇంతకు ముందు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌ లతో మంచి అంచనాలు క్రియేట్ చేయగా, తాజాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసేశారు. కాసేపటికిందే రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇక మేకర్స్ కంప్లీట్ కామెడీ & ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ సరికొత్త కథనంతో ఫ్రెష్ గా ఉండి ఆకట్టుకుంటుంది.

Janaka Aithe Ganaka Movie Trailer Talk

కొత్త కంటెంట్, కొత్త పాయింట్ కానీ..?

ఇక జనక ఐయితే గనక (JanakaAitheGanaka) ట్రైలర్ నెట్టింట మంచి ట్రెండ్ అవుతుంది. ఈ ట్రైలర్ మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మంచి కామెడీగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా సుహాస్, వెన్నెల కిషోర్‌ ల మధ్య వచ్చే సీన్స్ సినిమాకి హైలెట్ అయ్యేలా ఉన్నాయి. సింపుల్ గా కథ చెప్పాలంటే, హీరో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్, హీరోయిన్ న బిగినింగ్ లోనే పిల్లలు కొత్త కాలం వద్దని చెప్పి పెళ్లి చేసుకుంటాడు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి నచ్చదు. ఈ క్రమంలో హీరో వైఫ్ ప్రెగ్నెంట్ అవుతుంది. హీరో సేఫ్టీ వాడినా, వైఫ్ ప్రెగ్నెంట్ కావడంతో హీరో పలానా కంపెనీ పై కేసు వేస్తాడు? కాన్సెప్ట్ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేయడంతో కాన్సెప్ట్ ఆల్మోస్ట్ బాగానే ఉన్నా థియేటర్లో వర్కౌట్ అవుతుందా లేదా అన్న డౌట్ వస్తుంది.

- Advertisement -

జనాలు థియేటర్లకు వస్తారంటారా?

ఇక రిలీజ్ చేసిన ట్రైలర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. కామెడీ, మ్యూజిక్, బీజీఎమ్ సినిమాకి తగ్గట్టు బానే ఉన్నాయి. ఇక సినిమాలో సంగీర్తన విపిన్ హీరోయిన్‌గా నటిస్తుంది. గోపరాజు రమణ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ బుల్గనిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా సందీప్ బండ్ల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. అయితే ట్రైలర్ లో మొత్తంగా బాగానే ఉన్నా, అయితే ట్రైలర్ లాస్ట్ లో హీరో కండోమ్ కంపెనీ పై కేసు పెడతాడు. సినిమా నేపథ్యం దానిపైనే తిరుగుతుందని అనిపిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ బాలీవుడ్ లో కామన్ గాని, టాలీవుడ్ లో కష్టమని చెప్పాలి. దాంతో టాలీవుడ్ జనాలు ఈ సినిమా కోసం థియేటర్ల దాకా వస్తారా అంటే చెప్పలేం. ఇది తెలియాలంటే రిలీజ్ డేట్ సెప్టెంబర్ 7 వరకు వెయిట్ చేయాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు