Janhvi Kapoor: బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన జాన్వీ..!

Janhvi Kapoor: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అతిలోకసుందరి అందాల తార శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన అందాలతో నటనతో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా గ్లామర్ డోస్ పెంచేసి అలరిస్తున్న ఈమె , ఇంస్టాగ్రామ్ ను తన సంపాదనకు ప్లాట్ఫారం గా చేసుకొని మరింత ఆర్జిస్తోంది అని చెప్పవచ్చు. ఇకపోతే ఇటీవలే తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. తన తల్లి కోరిక మేరకు స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడైన జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరా సినిమాలో నటిస్తోంది.. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Janhvi Kapoor: Breakup with boyfriend.. Janhvi gave a twist at the end..!
Janhvi Kapoor: Breakup with boyfriend.. Janhvi gave a twist at the end..!

బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పిన జాన్వీ కపూర్..

ఇదిలా ఉండగా తాజాగా తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈమె మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ ఫహారియా తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు వీరిద్దరూ కలిసి పలు ఫంక్షన్లకు హాజరవుతూ తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలోనే వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా.. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

మళ్లీ సారీ చెప్పా – జాన్వీ ఆరోగ్య..

అసలు విషయంలోకెళితే జాన్వీ కపూర్ ఈ విషయంపై స్పందించింది. అప్పట్లో మూడ్ స్వింగ్స్ కారణంగా నా బాయ్ ఫ్రెండ్ కి ప్రతి నెల బ్రేకప్ చెప్పేదాన్ని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఉలఝ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ.. నేను ప్రతి నెల నా బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేదాన్ని . అయితే బ్రేకప్ చెప్పాక మళ్ళీ రెండు రోజుల తర్వాత నేనే సారీ కూడా చెప్పేదాన్ని. అయితే మొదట్లో బ్రేకప్ చెప్పగానే శిఖర్ ఆశ్చర్యపోయాడు. ఇక ఏం చేయాలో అతడికి అర్థం కాలేదట. కానీ రెండు రోజులకే సారీ చెప్పేసరికి అతడి ఆలోచన మానుకున్నాడు. కానీ పదేపదే నేను బ్రేకప్ చెప్పడం , మళ్ళీ సారీ చెప్పి కలిసిపోవడం లాంటివి చూసి రాను రాను అతడే నా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు .అంటూ జాన్వి కపూర్ చెప్పుకొచ్చింది. ఇకపోతే తనలో జరిగే మూడ్ స్వింగ్స్ కారణంగానే తాను ఇలా ప్రవర్తిస్తున్నానని, తన ప్రవర్తనను తాను అర్థం చేసుకున్నాడని ప్రస్తుతం తామిద్దరం సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చింది జాన్వి కపూర్. ఇక జాన్వి కపూర్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

జాన్వి కపూర్ సినిమాలు..

ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న ఈమె ఈ సినిమా పూర్తయిన వెంటనే రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే.. నాని 33వ చిత్రానికి కూడా సైన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాల తర్వాత మరికొంతమంది హీరోలకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు