Nani : న్యాచురల్ స్టార్ నాని ( Nani ) ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరో యాక్షన్, ఎంటర్టైనర్ మూవీలో నటిస్తున్నాడు. సరిపోదా శనివారం (Saripoda Sanivaram )మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ( vivek Atreya ) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 29 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను గట్టిగా చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నాని ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జాన్వీ కపూర్ ( Janvikapoor ) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. కొన్ని రోజులుగా వస్తోన్న రూమర్స్‌కు చెక్ పెట్టారు. తన (Nani) తర్వాతి సినిమాలో జాన్వీ కపూర్ నటించనుందన్న ప్రచారంపై స్పందించారు. నా కొత్త సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తుందనేది కేవలం రూమర్ మాత్రమే అని కొట్టి పారేశాడు. బహుశా ఆమెను తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అవుతోంది. నేను కొన్ని రోజులుగా వరుస షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నాను. అందుకే ఆ ప్రాజెక్ట్ గురించి వివరాలు తెలుసుకోలేకపోతున్నా’ అని సమాధానమిచ్చారు. ఆ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయని నాని చెప్పాడు.
ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమాల్లో బిజీగా ఉంటుంది. ఇటు టాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తుంది. రెండు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో ఆడిపాడనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు ట్రెండ్ క్రియేట్ చేశాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈమె జాలరి పాత్రలో నటిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను అలరించాయి. సెప్టెంబర్ 27న దీని మొదటి పార్ట్ విడుదల కానుంది. దీంతో పాటు బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబినేషన్లో రానున్న చిత్రంలోనూ జాన్వీ నటించనున్నారు. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక నాని సినిమాలో, విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తుందని టాక్..