Janhvi kapoor: జాన్వీకి పక్షవాతం..షాక్ లో ఫ్యాన్స్..!

Janhvi kapoor.. బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాన్వీకపూర్ ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. తన తల్లిలాగే అటు బాలీవుడ్ , ఇటు టాలీవుడ్ ను ఏలే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ముఖ్యంగా హిందీలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో కూడా వరుస పోస్టులతో ఆ క్రేజ్ మరింత పెంచుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా కోసం తాపత్రయపడుతోంది. అందులో భాగంగానే టాలీవుడ్ లో ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ అమ్మడు అలాగే రామ్ చరణ్, నాని సినిమాలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రాలన్నీ కూడా విజయం సాధిస్తే ఇక తెలుగులో ఈమెకు తిరుగు ఉండదు.

Janhvi kapoor: Janhvi is paralyzed..fans in shock..!
Janhvi kapoor: Janhvi is paralyzed..fans in shock..!

అక్కడే ఫుడ్ పాయిజన్..

ఇదిలా ఉండగా జాన్వి కపూర్ హిందీలో ఉలఝ్ సినిమా చేస్తోంది. ఈ సినిమా ఆగస్టు 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా మరోవైపు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహానికి హాజరై వచ్చిన తర్వాత జాన్వీ కపూర్ ఫుడ్ పాయిజన్ కు గురైంది.. దీనికి తోడు ముంబై హాస్పిటల్ లో జాయిన్ చేశామని ఆమె తండ్రి బోనీకపూర్ కూడా వెల్లడించారు. రెండు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఈమె డిస్చార్జ్ చేయండి

పక్షవాతం వచ్చింది..

ఇక ఇప్పుడు ఉలఝ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని తన హెల్త్ కండిషన్ గురించి క్లారిటీ ఇచ్చింది. హాస్పిటల్లో జాయిన్ కావడం అదే మొదటిసారి. ఒక ఈవెంట్ కోసం నేను చెన్నైకి వెళ్తుండగా, బాగా ఆకలేసింది. అందుకే ఎయిర్పోర్టులో ఫుడ్ తిన్నాను. ముందు బాగానే ఉన్నా కాసేపటికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. భరించలేకపోయాను. నడవలేకపోయాను. నీరసం ఆవహించింది. దాంతో భయపడిపోయాను. వణికిపోయాను. అంతేకాదు హైదరాబాదుకి వచ్చేందుకు ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తే అప్పుడు నాకు పక్షవాతం వచ్చిందేమో అనే భావన కలిగింది. అందుకే వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను.

- Advertisement -

లివర్ ఇబ్బంది పడింది..

ఇక ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్లు పరీక్షలు నిర్వహించిన తర్వాత రిపోర్ట్స్ చూసి ఆశ్చర్యపోయారు.. లివర్ బాగా ఇబ్బందికి గురవడం వల్ల ఇలా అనిపించిందని, రెండు, మూడు రోజులు హాస్పిటల్ లోనే ఉండాలని చెప్పారు. తరచూ చిన్న చిన్న వాటికి నేనే ఏ రోజూ భయపడలేదు. కానీ ఒకేసారి లివర్ ఇబ్బందులకు గురైందని చెప్పేసరికి ఆ భయం నాకు ఒక్కసారిగా మనశ్శాంతి లేకుండా చేసింది.. ఎంతో భయపడిపోయాను కానీ వైద్యులు నాకు ధైర్యం చెప్పారు.. ప్రస్తుతం కోలుకున్నాను అందుకే మళ్ళీ సినిమా షూటింగ్లలో పాల్గొనడానికి సిద్ధమయ్యాను అంటూ జాన్వి కపూర్ చెప్పుకొచ్చింది. ఇకపోతే తన హెల్త్ కండీషన్ గురించి ఇలాంటి కామెంట్లు చేయడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూటింగ్లో పడి సమయానికి ఆహారం తినకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని, ముందుగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని, ఆ తర్వాతే సినిమా షూటింగ్ లంటూ కూడా సలహాలు ఇస్తున్నారు ఫ్యాన్స్. ఏది ఏమైనా పక్షవాతానికి గురయ్యాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది జాన్వీ కపూర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు