Janhvi Kapoor : ఆ సినిమా మధ్యలోనే ఆపేద్దాం అనుకున్నా

Mr and Mrs Mahi movie: రాజ్‌కుమార్‌ రావు, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మాహి’. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కతున్న ఈ సినిమా మే 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ని రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే క్రికెట్‌ ఆడటం, చూడటం ఇష్టం ఉండే భార్య పాత్రలో జాన్వీ నటించింది. తనకు ఇష్టమైన క్రికెట్ ను తండ్రి వల్ల విడిచిపెట్టిన కొడుకు పాత్రలో రాజ్ కుమార్ రావు నటించారు.

Janhvi Kapoor : Let's stop in the middle of that movie
Janhvi Kapoor : Let’s stop in the middle of that movie

మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మాహి కథాంశం
తన తండ్రి కోసం క్రికెటర్ అవ్వాలనే తన కలను వదులుకుంటాడు రాజ్‌కుమార్‌ రావు. తండ్రి వ్యాపారం చూసుకుంటున్న అతడికి డాక్టర్‌ చదివిన మహి తో పెళ్లి.. ఇక క్రికెట్‌ అంటే ఇష్టం ఉన్న ఆమె కూడా, తన తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్‌ అవుతుంది. పెళ్లి తర్వాత ఆమె భర్త మహి తన ప్రతిభను గుర్తించి ఆమె కలను నిజం చేసుకోమంటాడు. తనకు ఇష్టమైన క్రికెట్‌ ఆడమని ప్రొత్సహిస్తాడు. అంతేకాదు దగ్గరుండి తనకి కోచింగ్ కూడా ఇస్తాడు. అలా భార్యకు సపోర్టు ఇచ్చి ఆమె కలను నిజం చేస్తాడు.

ఈ క్రమంలో వారికి ఎదురైన చేదు అనుభవాలు, ఆడపిల్ల క్రికెట్‌ ఆడటం ఏంటని ప్రశ్నించే సమాజం.. ఇలా తమ చూట్టు పరిణామాలు ఎదుర్కొని ‘మహి’ క్రికెటర్‌ ఎలా అయ్యిందనే అంశాలతో ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ట్రైలర్‌ను మలిచారు. ఈ సినిమా నిర్మాత కరణ్‌ జోహార్‌ తాజాగా సోషల్‌ మీడియా వేదికగా మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రొమోషన్స్ లో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది జాన్వీ.

- Advertisement -
Janhvi Kapoor : Let's stop in the middle of that movie
Janhvi Kapoor : Let’s stop in the middle of that movie

షూటింగ్ టైం లో గాయాలు
‘ఈ సినిమా కోసం ‘మిలీ’ సినిమా షూటింగ్‌ సమయంలోనే కోచింగ్ తీసుకున్నాను. ఐతే, పూర్తిగా నేర్చుకోవడానికి రెండేళ్లు పట్టింది. నా కోచ్‌ లు నన్ను పూర్తి క్రికెటర్‌గా మార్చడానికి చాలా కష్టపడ్డారు.ఐతే, ఈ సినిమా షూటింగ్ టైం లో నాకు ఎన్నో గాయాలయ్యాయి. ఓ టైం లో అయితే, నా రెండు భుజాలు పనిచెయ్యవేమో అనుకున్నాను. ఆ సమయంలోనే ఎన్నోసార్లు ఈ సినిమా నుంచి నేను తప్పుకోవాలని భావించాను. కానీ, ఈ చిత్ర యూనిట్ నాకు ధైర్యం చెప్పారు. నన్ను ముందుకు నడిపారు’ అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు