Janhvi Kapoor: ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ పై జాన్వీ షాకింగ్‌ కామెంట్స్‌ !

Janhvi Kapoor: జాన్వీ కపూర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీవైపుకు మళ్ళింది. దేవర సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానుంది. ఇక జాన్వీ కపూర్ దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కాబోతోంది.

అయితే తాజాగా ఈ సినిమా గురించి జాన్వీ కపూర్ కపూర్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. దేవర సినిమాలో నేను తంగం పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నా పాత్ర చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పటివరకు నేను చేసిన షూటింగ్ చాలా సరదాగా జరిగింది. సెట్ లో అందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఇక చిత్ర యూనిట్ పనితీరు, అంకితభావానికి నేను ఆశ్చర్యపోయాను. ఈ సినిమా కథ చాలా విభిన్నమైనది. ఈ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు చాలా థాంక్స్ అని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా ఈ బ్యూటీ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించింది. ఎన్టీఆర్ ఎలాంటి స్టెప్ అయినా సరే ఒక్క సెకనులో నేర్చుకుంటారు. అదే స్టెప్పును నేను నేర్చుకోవడానికి పది రోజుల సమయం పడుతుంది. ఎన్టీఆర్ డ్యాన్స్, ఫాస్ట్ నెస్ చూసి షాక్ అయ్యాను. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో. సెట్ లోకి ఎన్టీఆర్ రాగానే కల వస్తుంది… అందరూ చాలా ఉత్సాహంగా ఉంటారని ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

- Advertisement -

janvi-kapoor-to-play-negetive-role-in-devara-movie

ఇక దర్శకుడు కొరటాల శివ గురించి మాట్లాడుతూ…. శివ గారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి విషయాన్నైనా చాలా సున్నితంగా చెబుతారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సులభం. తెలుగువారి పనితీరు నాకు చాలా నచ్చింది. ఇంకా తెలుగులో చాలా సినిమాలు చేయాలని అనిపిస్తోందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు