Janhvi Kapoor: శ్రీదేవి పెద్దల్లుడికి ఈ క్వాలిటీస్ ఉండాల్సిందేనట..?

టాలీవుడ్ అతిలోక సుందరిగా పేరు పొందిన శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈమె వారసురాలుగా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ జాన్వీ కపూర్.. టాలీవుడ్ లోకి దేవర సినిమాతో మొదటి సారిగా ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తనకు కాబోయే భర్త గురించి జాన్వీ కొన్ని క్వాలిటీస్ ఉండాలని.. అవి ఇలాగే వుండాలనే విధంగా తెలియజేసింది. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

శ్రీదేవి అల్లుడిలో వుండాల్సిన క్వాలిటీస్ ఇవే..

Janhvi Kapoor: Sridevi's elders should have these qualities..?
Janhvi Kapoor: Sridevi’s elders should have these qualities..?

జాన్వీ కపూర్ తన నెక్స్ట్ సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉన్నది.. ఈ చిత్రంలో హీరోగా రాజ్ కుమార్ రావు నటించారు. దీంతో జాన్వీ, రాజ్ కుమార్ ఇద్దరూ కూడా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్నప్పుడు జాన్వీ కపూర్ తన కాబోయే వాడి గురించి ప్రశ్న రాగా.. ఇలాంటి క్వాలిటీస్ ఉండాలని తెలియజేసింది.. జాన్వి కపూర్ ఇలా స్పందిస్తూ.. నాకు ఎప్పుడూ కూడా అండగా ఉండేవాడు కావాలి…. నా కలలను.. తన కలలుగా భావించేవారు కావాలి ..నాకు బలం ఇచ్చేవారు అయి ఉండాలి.. .. నన్ను ఎదగనిచ్చేవాడు కావాలి..నాకు సంతోషాన్ని ఇచ్చేవాడు కావాలి.. నన్ను నవ్వించేవాడు.. ఒకవేళ నేను ఏడిస్తే నాకు అండగా నిలబడే వాడు కావాలంటూ జాన్వీ కపూర్ తెలియజేసింది..

శిఖర్ పహారియా తో డేటింగ్..

ఈ విషయాలు విన్న అభిమానులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. జాన్వి కపూర్ కాబోయే భర్త గురించి ఇన్ని కలలు కంటోందా అంటూ శ్రీదేవి అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.. మరి కొంతమంది శ్రీదేవి అల్లుడు అంటే అలా ఉండాలి అన్నట్టుగా కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయం పక్కన పెడితే.. బాలీవుడ్ లో మాత్రం జాన్వీ కపూర్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా శిఖర్ పహారీయాతో డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

అంబానీ ప్రీ వెడ్డింగ్ లో..

గడచిన కొద్దిరోజుల క్రితం అంబానీ ప్రీ వెడ్డింగ్ కు కూడా ఇద్దరు కలిసి వెళ్ళడం తో ఈ విషయం మరింత వైరల్ గా మారుతోంది. ఆమధ్య తిరుపతికి వచ్చినప్పుడు కూడా జాన్వి వెంటనే శిఖర్ ఉండడం గమనార్హం.. శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ సిండే మనవడే.. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లుగా సమాచారం. వీరిద్దరి విషయం పైన కూడా శ్రీదేవి భర్త బోణీ కపూర్ కూడా.. శిఖర్ గురించి చాలా పాజిటివ్ గానే మాట్లాడారు.. మరి రాబోయే రోజుల్లో ఇద్దరు వివాహం చేసుకుంటారా లేదా చూడాలి మరి..

జాన్వీ కపూర్ సినిమాలు..

జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ తో దేవరా సినిమాలో నటిస్తుండడమే కాకుండా రామ్ చరణ్ నటిస్తున్న RC -16 చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపిక అయింది. ఈ సినిమాల తర్వాత మరో స్టార్ హీరోకి ఈమె ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు