JanhviKapoor: జాన్వీ కపూర్ అందాలు..ఇక అరుపులే!

JanhviKapoor: జాన్వి కపూర్ ఈ బ్యూటీ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ధడక్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ జాన్వి కపూర్. ఆ సినిమా అనంతరం హిందీలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. లేడీ ఓరియంటల్ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

Janhvi Kapoor’s Gorgeous Green Saree is Perfect For a Desi Playdate

ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీవైపుకు మళ్ళింది. తన తల్లి శ్రీదేవి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మంచి గుర్తింపు తెచ్చుకుందని….తల్లి బాటలోనే తాను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా పూర్తి కాకముందే జాన్వికి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా….. జాన్వికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ అందాలకు కుర్ర కారు అంతా ఫిదా అవుతారు. నిత్యం సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ చెమటలు పట్టిస్తుంటుంది. తన అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే.

- Advertisement -

ఈ క్రమంలోనే జాన్వి తాజాగా గ్రీన్ కలర్ చీరలో తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫోటోలో జాన్వి అందంగా, హాట్ గా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కాగా దేవర సినిమా చేస్తున్న జాన్వి కపూర్…ఇప్పటికే రామ్‌ చరణ్‌ సినిమాలో అవకాశం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు