Jani Master : ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా – జానీ మాస్టర్

Jani Master : టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్ ఒకరన్న విషయం తెలిసిందే. ఒక్క టాలీవుడ్ లోనే కాదు, సౌత్ ఇండియా అంతటా స్టార్ హీరోల సినిమాలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తుంటాడు. ఇక జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడంటే ఆ సినిమాలో స్టార్ హీరోకి ఓ రేంజ్ మాస్ బీట్ కంఫర్మ్ అని అంటుంటారు ఫ్యాన్స్. ఆల్మోస్ట్ తెలుగు స్టార్ హీరోలందరి సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ ప్రస్తుతం సినిమాల్లో తన వృత్తిని కొనసాగిస్తూనే, టెలివిజన్ లో ఢీ వంటి డాన్స్ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే గత రెండు నెలలుగా మాత్రం జానీ మాస్టర్ ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ గెలవడం డిప్యూటీ సీఎం అవ్వడమూ జరిగిపోయాయి. ఇక జానీ మాస్టర్ తిరిగి తన పనిలో నిమగ్నమయ్యాడు. అయితే ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట సతీష్ అనే డాన్సర్ జానీ మాస్టర్ పై ఆరోపణలు చేస్తూ ప్రజావాణిలో జానీ మాస్టర్ పై పిర్యాదు చేసాడు. జానీ మాస్టర్ తనని షూటింగ్ లకి పిలవవద్దని మూవీ యూనిట్లకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని ఆరోపణలు చేసాడు. తాజాగా జానీ మాస్టర్ దీనిపై స్పందించాడు.

Jani Master responded to the allegations against him

సతీష్ ఆరోపణలకు స్పందించిన జానీ మాస్టర్…

ఇక జానీ మాస్టర్ ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ డాన్స్ మాస్టర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. డాన్స్ మాస్టర్ సతీష్ జానీ పై ఆరోపణలు చేస్తూ తనని ఇండస్ట్రీలో ఉండనివ్వట్లేదని అవకాశాలు రాకుండా చేస్తున్నాడని ప్రజావాణిలో పిర్యాదు చేసాడు. అంతే కాదు పవన్ కళ్యాణ్ కి కూడా పిర్యాదు చేసినట్టు టాక్ ఉంది. ఇక సతీష్ కొన్ని రోజుల కింద టాలీవుడ్ లో జనరల్ బాడీ మీటింగ్ లో పలు సమస్యలపై జానీ మాస్టర్ పై వ్యతిరేకంగా మాట్లాడినందుకే జానీ మాస్టర్ తన పై కక్ష్య పెంచుకున్నాడని ప్రజావాణి కంప్లైంట్ లో డాన్సర్ సతీష్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా సతీష్ చేసిన ఆరోపణలకు జానీ మాస్టర్ తాజాగా స్పందించాడు. జానీ మాస్టర్ మాట్లాడుతూ.. సతీష్ పైనే ఆరోపణలు ఉన్న మాట వాస్తవం. అతను చేసిన కొన్ని తప్పులకు రూల్స్ ప్రకారం డాన్స్ మాస్టర్ల కమిటీ వాళ్ళు అతనికి లక్ష రూపాయల ఫైన్ విధించారని, కానీ ఒకరి పొట్ట కొట్టాలని ఎప్పుడూ అనుకోలేదని, సతీష్ తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పుకుంటే క్షమించేవాళ్లమని జానీ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా – జానీ

ఇక జానీ మాస్టర్ (Jani Master) సతీష్ తనపై చేసిన ఆరోపణలకు కూడా గట్టిగా స్పందించాడు. గత నాలుగు నెలల్లో తనపై సతీష్ కొన్ని ఆరోపణలు చేసాడని, కానీ తాను వేటికి ఒప్పుకోనని, సతీష్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా అని అన్నాడు. దీనిపై జానీ మాస్టర్ భార్య అయేషా కూడా మాట్లాడుతూ, సతీష్ జనరల్ బొర్డ్ మీటింగ్ లో జరిగిన విషయాలని రూల్స్ అతిక్రమించి లీక్ చేసాడని, అందుకే అతనికి ఫైన్ వేశామని, కానీ అతను ఎక్కడా తప్పు ఒప్పుకోకుండా డాన్స్ మాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు అయిన జానీ మాస్టర్ ని బూతులు తిట్టాడని అందుకే అతడ్ని శిక్షించామని అయేషా చెప్పుకొచ్చారు. అంతే కాదు జానీ మాస్టర్ పై ఆరోపణలు సృష్టించి జానికి వ్యతిరేకంగా మాట్లాడమని పలువురు డాన్సర్లకి లంచం ఇచ్చాడని, ప్రాంతీయాభిమానంతో విద్వేషాలు రెచ్చగొట్టాడని చెప్పుకొచ్చారు. ఓవరాల్ గా దీనిపై TFI కూడా చర్చించి నిజమెంటో తెలుసుకుని సర్దుమణిగేలా చేస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు