Janvi Kapoor: బెడ్ రూమ్ లో బాయ్ ఫ్రెండ్ తో తండ్రికి అడ్డంగా దొరికిపోయిన జాన్వి..!

Janvi Kapoor: అతిలోక సుందరి వారసురాలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. ఇక తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది ఈ బ్యూటీ. ఇక జాన్వి కపూర్ టాలీవుడ్ తొలి సినిమా రిలీజ్ కాకముందే వరుస అవకాశాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాకి కూడా ఓకే చెప్పింది జాన్వి.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ నటి రాజ్ కుమార్ రావ్ సరసన నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే జాన్వి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలను తన అభిమానులతో పంచుకుంది. తాను బెడ్ రూమ్ లో ఫ్రెండ్ తో తన తండ్రికి అడ్డంగా దొరికిపోయాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది. జాన్వి కపూర్ మాట్లాడుతూ..” ఒక రోజు మా ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో నా స్నేహితుడు మా ఇంటికి వచ్చాడు.

Jhanvi Kapoor
Jhanvi Kapoor

దీంతో అతన్ని మా బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. దీంతో ఒక్కసారిగా మా నాన్న వచ్చిన శబ్దం వినబడి అతన్ని వెంటనే మా కిటికీ నుంచి ఇంటికి పంపించేసాను. ఇక మా నాన్నకు నేను దొరకలేదు అని ఆనందపడే లోపే మా డాడీ సిసి కెమెరాలు నేను చేసిన పని మొత్తం చూసాడు. దీంతో కాస్త కోపానికి గురయ్యాడు. తరువాత మా ఇంటి కిటికీలు అన్నిటినీ గ్రిల్స్ తో మూసివేసి.. నన్ను తిట్టి శిక్షించాడు ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రెసెంట్ ఈ బ్యూటీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు