Japan : ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

విభిన్నమైన సినిమాలతో హీరోగా తమిళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపుతో పాటు మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్నారు హీరో కార్తీ. ‘ఖైదీ’ సంచలన విజయంతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసిన ఈ తమిళ స్టార్ రీసెంట్ గా పిఎస్ మిత్రన్ డైరెక్షన్ లో ‘సర్దార్’ మూవీతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన విషయం తెలిసిందే.

భవిష్యత్తులో నీటి చుట్టూ ఊహించని విధంగా భారీ స్థాయిలో బిజినెస్ జరగబోతుందని, సామాన్యుడికి భవిష్యత్తులో నీటి చుక్క కూడా దొరకదనే కథతో ఓ స్పై థ్రిల్లర్ గా ఈ మూవీ ని తెరకెక్కించిన తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది ఇలా ఉండగా కార్తీ మరో సినిమాతో ప్రేక్షకుల ముందకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

ఇంట్రెస్టింగ్ కథతో పాటు విభిన్నమైన టైటిల్ ’జపాన్‘ తో కార్తీ రాబోతున్నాడు. ఈ వారం ప్రారంభంలోనే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు. కోకిల, జోకర్ మరియు జిప్సీ వంటి సినిమాలకు దర్శకత్వవం వహించిన రాజు మురుగన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే, తాజా అప్డేట్ ఏంటంటే, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు