Jayam Child Artist : జయంలో నటించిన ఈ చిన్నపిల్లాడు ఇప్పుడెలా ఉన్నాడో చూశారా?

Jayam Child Artist : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కేరీర్ లో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సినిమా జయం.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. నితిన్, సదాల కేరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది.. ఈ సినిమా చిన్నప్పుడు గోపీచంద్ పాత్రలో నటించిన కుర్రాడు అందరికీ గుర్తే ఉంటాడు కదా.. ఇప్పుడు కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేశాడు.. అతను ఎవరో గుర్తుకు వచ్చిందా? అవును మీరు గెస్ చేసింది 100% కరెక్ట్.. ఆ పిల్లాడి పేరు దిలీప్ కుమార్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు..

నెంబర్ వన్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యాడు దిలీప్. చిన్నతనం లో 30కి పైగా సినిమాలు మరియు సీరియల్స్ లో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు.. కానీ నితిన్ జయం అతనికి మంచి సక్సెస్ ను అందించింది.. గోపీచంద్ చిన్నప్పటి పాత్రలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. అప్పటిలో వరుస సినిమాలు చేసిన ఈ కుర్రాడు ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.. కానీ ఇంతవరకు సరైన హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో సినిమాలకు గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సొంతంగా పలు వ్యాపారాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Jayam Movie Child Artist Dilip Kumar Latest Photos
Jayam Movie Child Artist Dilip Kumar Latest Photos

2019లో ఒకే ఒక్క సినిమా దిక్సూచి లో హీరోగా నటించిన అది పెద్దగా క్లిక్ అవ్వలేదు దాంతో ఆయన నటుడిగా ప్రయత్నాలు మానేశారు ఇక 2022లో ఒక డాక్టర్ ను పెళ్లి చేసుకుని సెటిలైపోయాడు.. చాలా మంది హీరోగా నిలదొక్కుకోవాలని అనుకుంటే ఇతను మాత్రం సైలెంట్ అయ్యాడు.. పెద్దగా సినిమాలు చెయ్యలేదు.. ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకపోతే ఏమీ సాధించలేము అని చెప్పడానికి దిలీప్ కుమార్ కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.. ఇండస్ట్రీకి దూరంగా ఉన్న దిలీప్ కుమార్ ప్రస్తుతం ఫ్యామీతో హ్యాపిగా ఉన్నాడు.. ఇక ముందు సినిమాలు చేస్తాడేమో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు