Jayam movie: వామ్మో..హాట్ అందాలతో రచ్చ చేస్తున్న జయం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..!

Jayam movie.. ఒకానొక సమయంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించి.. ఆ తర్వాత సినిమాలలో హీరో హీరోయిన్లుగా నటిస్తూ ప్రేక్షకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు.. అలా ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోలుగా, హీరోయిన్ లుగా కొనసాగుతున్న వారు కూడా ఉన్నారు. మరికొంతమంది ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అవకాశం దక్కించుకోవడానికి హాట్ గా అందాలు వలకబోస్తూ హీరోయిన్లకే గట్టి పోటీ ఇస్తూ ఉంటారు.. అలాంటి వారిలో జయం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఒకరు. తేజ డైరెక్షన్లో హీరో నితిన్ ,హీరోయిన్ సదా జంటగా వచ్చిన చిత్రం జయం. ఇక ఇందులో విలన్ గా గోపీచంద్ నటించారు. యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్న లవ్ స్టోరీ చిత్రాలలో ఇది కూడా ఒకటి. ఇప్పటికీ బుల్లితెరపై ప్రసారమైతే మాత్రం చాలామంది టీవీలకే పరిమితమవుతారు. అంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా..

గ్లామర్ లేడీగా మారిపోయిన జయం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..

Jayam movie:Jayam movie child artist became too beauty..!
Jayam movie:Jayam movie child artist became too beauty..!

ఇదిలా ఉండగా ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ కి చెల్లిగా నటించిన అమ్మాయి ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. ఈ అమ్మాయి పేరు యామిని శ్వేతా నాయుడు జయం సినిమాలో అక్షరాలు రివర్స్ లో రాసి ఆకట్టుకున్న శ్వేత ఒక్క సినిమాలో మాత్రమే నటించింది .. ఆ తర్వాత నటనకు స్వస్తి పలికి చదువుపై దృష్టి పెట్టింది.. అలాగే లైఫ్ లో మంచిగా సెటిల్ అయ్యి పెళ్లి కూడా చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ హాట్ లుక్స్ ను నెట్టింట షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. భర్తతో ఎంజాయ్ చేస్తున్న వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.. ఇక తాజాగా మరొకసారి బీచ్ లో థైస్ అందాలు చూపిస్తూ పలు ఫోటోలను షేర్ చేయగా ఇది చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.. వామ్మో జయం మూవీ చైల్డ్ ఆర్టిస్టు ఇంత హాట్ గా మారిందేంటి అంటూ కామెంట్ లు చేస్తున్నారు.. మొత్తానికైతే యామిని శ్వేతా నాయుడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

ఈ మూవీ నటీనటుల విషయానికి వస్తే..

ఇక ఈ సినిమాలో నటించిన నటీనటుల విషయానికే వస్తే… నితిన్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ టైర్ 2 హీరోల జాబితాలో చేరిపోయారు.. ఇక స్టార్ హీరో అవ్వాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నా .. ఆ రేంజ్ లో హిట్ పడకపోవడం గమనార్హం.. మరొకవైపు హీరోయిన్ సదా కూడా ఇప్పుడిప్పుడే రీ యంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది.. అయితే హీరోయిన్గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే కాదు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు డాన్స్ షోలకి జడ్జిగా వ్యవహరిస్తోంది . ఇటీవలే ఢీ డాన్స్ జోడి కి శేఖర్ మాస్టర్ తో కలిసి జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తన అందాలతో గ్లామర్ షో చేస్తూ యువతను ఆకట్టుకుంటున్న ఈమె త్వరలోనే మళ్లీ ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం .

 

View this post on Instagram

 

A post shared by Yamini Swetha Naidu (@yamini_swetha)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు