Jayam Ravi: విడాకుల కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన రవి భార్య..!

Jayam Ravi.. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల వైవాహిక జీవితానికి సంబంధించిన పలు వార్తలు వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా కొన్ని జంటలు ఎంత వేగంగా వివాహం చేసుకుంటున్నాయో.. మరికొన్ని జంటలు అంతే అనూహ్యంగా విడాకులు ప్రకటిస్తున్నాయి.. ఇకపోతే కొంతమంది జంటలు విడాకులను అధికారికంగా ప్రకటిస్తే మరికొంతమంది ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.. ఇప్పటికే చాలామంది స్టార్ కపుల్స్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నా విడాకులు తీసుకొని. విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నారు.. అలాగే కొందరు పెళ్లయి.. పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడాకులు తీసుకోవడానికివెనుకడుగు వేయడం లేదు.. అయితే మరి కొంత మంది విడాకులు తీసుకోకపోయినా వారిపై అసత్య ప్రచారాలు చేస్తూ.. వారిని వార్తల్లో నిలిచేలా చేస్తున్నారు కొంతమంది ఫేకర్స్.. ఇప్పుడు ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీకి చెందిన మరో బ్యూటిఫుల్ జంట విడాకులకు సిద్ధమయిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

విడాకులకు సిద్ధమైన జయం రవి – ఆర్తి..

తాజాగా ఒక స్టార్ కపుల్ విడాకుల వార్తలు జోరందుకున్నాయి.. కోలీవుడ్ హీరోగా భారీ పాపులారిటీ దక్కించుకున్న జయం రవి.. ఆయన భార్య ఆర్తి విడాకులు తీసుకొని విడిపోవాలని ఫిక్స్ అయినట్లు రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు.. ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారాలు చేస్తున్నారు.. అంతేకాకుండా విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించినట్లు పుకార్లు వచ్చాయి.. ఈ క్రమంలోనే జయం రవి భార్య ఆర్తి ఇన్స్టా స్టోరీ లో ఒక పోస్ట్ పెట్టి విడాకులపై క్లారిటీ ఇచ్చి.. రూమర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిందని చెప్పవచ్చు.

ఒక్క పోస్టుతో రూమర్స్ కి కౌంటర్..

Jayam Ravi: Ravi's wife gave a twist in the divorce case..!
Jayam Ravi: Ravi’s wife gave a twist in the divorce case..!

ఇక ఆమె పెట్టిన పోస్ట్ చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది.. అది కూడా ఎలా చెప్పిందంటే తెలుగులో నితిన్ నటించిన మూవీని తమిళంలో జయం రవి నటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమా విడుదలై 21 సంవత్సరాలు పూర్తయింది.. దీంతో ఆర్తి ఈ సినిమా పోస్టర్ ను షేర్ చేస్తూ..” ప్రేమ అనే పదం ..ఇది మాటలు కాదు.. జీవితం” అంటూ క్యాప్షన్ కూడా జత చేసింది.. ప్రేమ ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని చెప్పడంతో విడాకుల వార్తలకు ఆర్తి ఈ విధంగా చెక్ పెట్టినట్లు అయింది.. ప్రస్తుతం ఆర్తి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారుతోంది. మొత్తానికైతే విడాకులు అంటూ ఈ జంటపై రూమర్స్ క్రియేట్ చేసిన ఫేకర్స్ కి.. ఈమె ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చిందని చెప్పవచ్చు..

- Advertisement -

ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్..

ఏది ఏమైనా ఇప్పటికైనా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని చాలామంది సెలబ్రిటీలు వేడుకున్నా.. కొంతమంది ఇలాంటివి సృష్టిస్తూనే ఉన్నారు.. ఇకపోతే జయం రవి ఆయన భార్య ఆర్తి విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలకు అభిమానులు తెగ కంగారు పడిపోయారు. కానీ ఆర్తి ఇచ్చిన క్లారిటీకి ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు