Nithya Menon : ఇన్నాళ్లకు మళ్ళీ ప్రేమకథలో నిత్యా.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Nithya Menon : టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరైన నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన క్యూట్ లుక్స్.. చక్కటి నటనతో నిత్యా మీనన్ దక్షిణాది ప్రేక్షకులపై వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. నటనకు స్కోప్ ఇచ్చే పాత్రలు చేసే అతి తక్కువ మంది హీరోయిన్లలో ఈమె ఒకరు. అంతే కాదు గ్లామర్ షో కి దూరంగా ఉండే ఈ మలయాళ కుట్టి, పేరుకి కేరళకి చెందిన అమ్మాయే అయినా, తెలుగమ్మాయిలానే నడుచుకుంటుంది ఇక్కడ. ఇక తెలుగులో చేసిన తొలి చిత్రం ‘అలా మొదలైంది’తోనే ఆమె మన ప్రేక్షకుల మనసులు దోచేసింది. ఇక నిత్యా ఏదో ఒక ఇమేజ్‌కు, జానర్‌కు పరిమితం కాకుండా అనేక రకాల పాత్రలు, సినిమాలు చేసింది. ఐతే ఆమె ఎన్ని సినిమాలు చేసినా.. ప్రేమకథల్లో నటిస్తే వాటికి ఉండే ఆకర్షణే వేరు. ‘అలా మొదలైంది’తో పాటు ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, ఓకే బంగారం, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు లాంటి చిత్రాలతో నిత్యా మీనన్ ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇక నిత్యాను ప్రేమకథల్లో చూడ్డానికే తన అభిమానులు ఎక్కువ ఇష్టపడతారు. అయితే నిత్యా మీనన్ ప్రేమకథలో నటించి కూడా కొన్ని సంవత్సరాలు అయింది.

Jayamravi and Nithya Menon starrer "Kadalikka Neramillai" Glimpses released

మళ్ళీ ప్రేమకథలో నిత్యా..

అయితే మామూలుగా ఏ హీరోయిన్ అయినా యంగ్ ఏజ్‌లో ఉన్నపుడే ప్రేమకథలు చేస్తుంది. తర్వాత పాత్రలు, కథలు మారిపోతాయి. ఒక హీరోయిన్ పదేళ్లు దాటి ఇండస్ట్రీలో ఉందంటే ప్రేమకథలు తన దగ్గరికి రావడం కష్టమే. అందులోనూ నిత్యా (Nithya Menon) ప్రయోగాత్మక కథలు చాలా చేస్తుంటుంది కాబట్టి క్రమంగా ప్రేమకథా చిత్రాలు తగ్గిపోయాయి. కానీ చాలా గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ ఒక అందమైన ప్రేమకథలో నటిస్తోంది. అది కూడా కోలీవుడ్ లో. ఇందులో జయం రవి హీరో. వీళ్లిద్దరి కలయికలో రానున్న సినిమాకు ‘కాదలిక్క నేరమిల్లై’ అని పేరు పెట్టారు. అంటే ‘ప్రేమించడానికి సమయం లేదు’ అని అర్థం. ఇలాంటి పేరు పెట్టి ప్రేమకథ తీయడం విశేషమే. రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

- Advertisement -

డైరెక్టర్ ఎవరో తెలుసా?

ఇక నిత్యా మీనన్ నటించబోయే ఈ సినిమాకు దర్శకత్వం వహించబోయేది ఒక లేడీ డైరెక్టర్. ఆమె ఎవరో కాదు తమిళ నటుడు, నిర్మాత, రాజకీయ నేత అయిన ఉదయనిధి స్టాలిన్ భార్య కృతిక ఉదయనిధి డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఈమె ఇంతకు ముందు కూడా వణక్కం చెన్నై, కాళీ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించింది. ఇక ఇప్పుడు కాదలిక్క నేరమిల్లై సినిమాను డైరెక్ట్ చేస్తుంది. ఇక ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాగా అందంగా, ఆకర్షణీయంగా ఉండి నిత్య అభిమానుల్లో ఆశలు, అంచనాలు రేకెత్తిస్తోంది. మరి మళ్లీ ప్రేమకథలో నిత్య మీనన్ ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు