Jayasudha: జయసుధ పై దారుణ కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు..ఫ్యాన్స్ ఫైర్..!

Jayasudha.. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది అలనాటి హీరోయిన్ జయసుధ.. ఈమె కెరియర్లో చేయని పాత్రలు అంటూ ఏవీ లేవు.. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరీ నటిస్తూ ఉంటుంది.. సీనియర్ హీరోలకు జోడీగా నటించిన జయసుధ.. ఈ తరం హీరోలకు అమ్మగా నటిస్తోంది. అయితే తాజాగా ఇలాంటి హీరోయిన్ పైన సీనియర్ నటుడు చలపతిరావు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Jayasudha: Famous actor who made bad comments on Jayasudha..fans fire..!
Jayasudha: Famous actor who made bad comments on Jayasudha..fans fire..!

చలపతిరావు సినిమాలు..

ఇదిలా ఉండగా గత ఏడాది చలపతిరావు అనారోగ్య సమస్యతో మరణించారు. సినిమాల మీద మక్కువతో ఇంటి నుంచి బయటికి వచ్చి మద్రాసు రైలు ఎక్కి హీరో అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చిన చలపతిరావు నందమూరి తారకరామారావు ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటుడుగా మంచి పాపులారిటీ అందుకున్నారు. ఎటువంటి అవకాశం వచ్చినా కూడా అందులో నటించేవారట. ఎన్టీఆర్ సపోర్టుతో ఎన్నో చిత్రాలలో నటించిన చలపతిరావు.. తన జీవితాన్ని మాత్రం మలుపు తిప్పిన చిత్రంగా దానవీరశూరకర్ణ సినిమానే మిగిలింది. అలాంటి సమయంలో సీనియర్ ఎన్టీఆర్ కి దీటుగా సూపర్ స్టార్ కృష్ణ కూడా కురుక్షేత్రంనే చిత్రాన్ని మొదలుపెట్టారట. దీంతో దాదాపుగా చాలామంది తెలుగు నటీనటులు సైతం రైల్లో రాజస్థాన్ కి ప్రయాణం వెళ్లాల్సి వచ్చిందట.

ఆ సమయంలోనే రామారావుకు కాస్త నటుల కొరత ఏర్పడడంతో.. ఆ సమయంలో చలపతిరావుకు అవకాశం లభించేలా చేశారు. దీంతో ఒక్కసారిగా చలపతిరావు పేరు ఇండస్ట్రీలో పాపులారిటీ అందుకుంది. నెమ్మదిగా వయసు పెరగడం రీత్యా హీరోలకు తండ్రి క్యారెక్టర్లలో కూడా నటిస్తూ మరింత పాపులారిటీ అందుకున్నారు. అలాగే విలన్ గా, కమెడియన్ గా కూడా ఎన్నో చిత్రాలలో నటించారు చలపతిరావు. చలపతిరావు నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు అందుకున్నారు.. తాను తెరకెక్కించిన చిత్రాలలో రక్తం చిందించిన రాత్రి, కడప రెడ్డమ్మ, పెళ్లంటే నూరేళ్లపంట, కలియుగ కృష్ణుడు తదితర చిత్రాలలో భాగస్వామిగా వ్యవహరించారు.

- Advertisement -

హీరోగానే కాదు విలన్ గా కూడా.

ఇక ఈయన కుమారుడే రవిబాబు.. రవిబాబు కూడా అటు హీరోగా, విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డైరెక్టర్ గా ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. 2017లో ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఈయన.. ఆ సమయంలోనే ఈయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి.. ముఖ్యంగా మహిళా సంఘాలు కూడా ఆందోళన చేసే విధంగా మారిపోయింది. ఈ విషయం పైన చలపతిరావు పైన వచ్చిన కొన్ని వార్తలు వల్ల ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను అని కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ముఖ్యంగా తనకు ఆడవారు అంటే చాలా గౌరవం అని ఎప్పుడూ కూడా వారిని అమర్యాదగా మాట్లాడను అంటూ తెలియజేశారు.

జయసుధ పై అలాంటి కామెంట్స్..

అలాగే బ్రతికున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో చలపతిరావు హీరోయిన్ ను రేప్ చేసే సన్నివేశాల పైన పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.. ముఖ్యంగా అలనాటి హీరోయిన్ జయసుధనీ చాలా చిత్రాలలో లెక్కలేనన్నిసార్లు సినిమాలలో రేప్ చేసే సన్నివేశాలలో చేశారని తెలిపారు. అంతేకాకుండా ఆమెకు తండ్రిగా కూడా తానే ఎన్నో సినిమాలలో నటించాను అంటూ చలపతిరావు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ విషయమైతే వైరల్ గా మారుతున్నది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు