Pushpa The Rule : పుష్పరాజ్ తో పోటీ పడలేక ‘సింగమే’ తప్పుకుంటే.. ఇప్పుడు ఆ యాక్షన్ హీరో వస్తాడట..!

Pushpa The Rule : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సినిమాల్లో “పుష్ప ది రూల్” ఒకటి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాపై అన్ని భాషల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా హిందీలో పుష్ప ది రూల్ కోసం మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా ఆగష్టు 15న పుష్ప ది రూల్ విడుదలకు సిద్ధం అవుతుంది. ఇక పుష్ప 2 నుండి ఇప్పటికే విడుదలైన టీజర్ గాని, సాంగ్స్ గాని ఆడియన్స్ మైండ్ లో ఓ రేంజ్ లో అంచనాలు పెంచేసాయి. ఇక ఇండిపెండెన్స్ డే కి భారీ వీకెండ్ లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా తో పోటికి కూడా ఇతర ఇండస్ట్రీల నుండి సినిమాలు వెనకడు వేస్తూ ఉన్నాయి. ఆల్రెడీ రిలీజ్ డేట్ ని ప్రకటించిన కొన్ని పెద్ద సినిమాలు పోటీ పడలేక వాయిదా వేసుకుంటే, ఒక యాక్షన్ హీరో మాత్రం పుష్పరాజ్ తో పోటీ పడేందుకు వస్తున్నాడు.

John Abraham Veda Movie Clash with Pushpa The Rule

పుష్ప రాజ్ తో కండలవీరుడు ఫైట్ కి రెడీ..

అయితే తెలుగు తర్వాత పుష్ప సినిమా సీక్వెల్ పైన భారీ అంచనాలు ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం “సింగం3” లాంటి బిగ్ మూవీ రిలీజ్ ను ముందు ప్లాన్ చేసినా, తర్వాత రిలీజ్ పోటీని తట్టుకోలేక రిస్క్ ఎందుకని ను పోస్ట్ పోన్ చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ సినిమా ప్లేస్ లో మరో సినిమా పోటికి సిద్ధం అవుతుంది. లాస్ట్ ఇయర్ ఆగస్టు 15 వీకెండ్ లో ఇది వరకు “సత్యమేవ జయతే2” సినిమాతో సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకున్న బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహం నటిస్తున్న లేటెస్ట్ మూవీ వేద మూవీని ఇప్పుడు రిలీజ్ చేయడానికి సిద్దం చేస్తూ ఉండగా, రీసెంట్ గా రిలీజ్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దాంతో ఇప్పుడు పుష్ప2 తో పోటికి ఈ సినిమా బాలీవుడ్ లో సిద్ధం అవ్వగా స్క్రీన్స్ పరంగా కొద్ది వరకు ఆ సినిమాకి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది. దాంతో కలెక్షన్స్ పరంగా కొంచం ఇంపాక్ట్ ఉండొచ్చు అంటున్నా కూడా ప్రస్తుతానికి జాన్ అబ్రహం సినిమాలు పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవ్వడం లేదు.

- Advertisement -

పుష్ప కోసం జాన్ అబ్రహం కూడా వెనక్కి తగ్గే ఛాన్స్..

అయితే ఇలాంటి టైంలో పాన్ ఇండియా మోస్ట్ క్రేజీ మూవీ అయిన పుష్ప2 (Pushpa The Rule) తో పోటి అంటే వేద సినిమాకు లారీ టైర్ కింద నిమ్మకాయ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఈ సినిమా ఓ రేంజ్ లో పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటే తప్పితే పుష్ప2 కి పోటి ఇచ్చే అవకాశం అయితే చాలా తక్కువే అని చెప్పాలి. మరి రిలీజ్ కి ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి, అప్పటివరకు వేద సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. లేదా రిస్క్ చేసి పుష్ప రాజ్ తోనే పోటీకి దిగుతాడా అనేది చూడాలి. ఇక పుష్ప 2 నుండి మూడో సింగిల్ లిరికల్ సాంగ్ జూన్ మూడో వారంలో రిలీజ్ కానుందని సమాచారం. ఇప్పటికే దాదాపు షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా, త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు