Oscars 2024 : ఆస్కార్స్ లో రెజ్లర్ న్యూడ్ షో… షాకింగ్ వీడియో

అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేడుకల్లో ఎప్పుడూ ఏదో ఒక రసాభాస జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఒక రెజ్లర్ బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డు ఇవ్వడానికి ఒంటిపై నూలు పోగు లేకుండా ఆస్కార్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ రెజ్లర్ ఎవరో కాదు జాన్ సినా. మరి ఇంతకీ ఆయన ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశాడు? అనే వివరాల్లోకి వెళితే…

ఆస్కార్ స్టేజ్ పై జాన్ సినా న్యూడ్ సీన్…
ఆస్కార్స్ 2024 సెలబ్రేషన్స్ లో ఈ ఏడాది బెస్ట్ అవార్డును ఇచ్చే అవకాశాన్ని డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సినాకు ఇచ్చారు నిర్వాహకులు. అయితే అవార్డును ప్రజెంట్ చేయడానికి జాన్ పేరును అనౌన్స్ చేసినప్పుడు ఆయన అభిమానులందరికీ తెగ ఆనందం కలిగింది. కానీ అతను తీరా స్టేజ్ పైకి వచ్చిన తీరు చూసి కోలుకోలేని షాక్ కి గురయ్యారు. జాన్ సినా ఒంటిపై నూలు పోగు లేకుండా స్టేజ్ పైకి వచ్చిన సీన్ చూసి స్టేజి కింద ఉన్న సెలెబ్రిటీలు తెగ నవ్వుకున్నారు. అయితే ఇక్కడ ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. అడ్డుగా విన్నర్ పేరు ఉన్న కార్డును పెట్టుకొని వచ్చాడు. మరి దాన్ని విన్నర్ అవనమానంగా భావించాలా? లేకపోతే అవార్డు వచ్చినందుకు సంతోషించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది అక్కడ. అక్కడితో ఆగకుండా జాన్ సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ అవసరం ఎంత ఉందో తెలిసింది అంటూ కామెంట్ చేయడం, అక్కడున్న అందరూ పకపకా నవ్వడం ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం మరో వ్యక్తి వచ్చి నామినిల జాబితాను అనౌన్స్ చేయడం జరిగింది. ఓపెన్ హైమర్, బార్బీ, పూర్ థింగ్స్, కిల్లర్స్ ఆఫ్ ఫ్లవర్ మూన్, నెపోలియన్ సినిమాలు నామినీలుగా పోటీలో నిలిచాయి.

డ్రెస్ వేసుకోవడం కూడా స్టేజ్ పైనే?!
ఇక అప్పటికే న్యూడ్ గా వచ్చి రసాభాస చేసిన జాన్ నామినీల వీడియోను స్క్రీన్ పై ప్లే చేస్తుండగానే అదే స్టేజ్ పై డ్రెస్ వేసుకోవడం మరో ఆసక్తికర విషయం. బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డుల నామినీల వీడియోలను ప్లే చేస్తున్న సమయంలో స్టేజ్ పై ఉన్న లైట్లు అన్నింటిని ఆర్పేశారు. అదే అదనుగా నలుగురైదుగురు వ్యక్తులు వచ్చి వేగంగా జాన్ సినాకు డ్రెస్ వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం జాన్ పూర్ థింగ్స్ బెస్ట్ ను కాస్ట్యూమ్ కేటగిరిలో విన్నర్ గా అనౌన్స్ చేశారు. కోట్లాదిమంది సినీ ప్రియులు చూసే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుక జరుగుతున్న స్టేజ్ పైకి ఒక స్టార్ ఇలా ఒంటి మీద నూలు పోగు లేకుండా న్యూడ్ గా రావడం ఏంటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

- Advertisement -

అవార్డ్స్ వేడుకను ఎక్కడ చూడొచ్చు?
96వ అకాడమీ అవార్డుల ఈవెంట్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న లాస్ ఏంజెల్స్ లో ఆదివారం రాత్రి అంటే మార్చ్ 10న ఘనంగా జరిగింది. జిమ్మీ కిమ్మెల్ ఈ వేడుకకు నాలుగోసారి హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ఇండియాలోని టైం ప్రకారం మార్చ్ 11న తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ ఈవెంట్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. భారతీయులు ఆస్కార్ అవార్డుల వేడుకను డిస్నీలో చూడొచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు