Pawan Kalyan : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగే వాళ్లు సినిమాలతో పాటుగా రాజకీయాల్లో కూడా రానించాలని అనుకుంటారు. అందులో భాగంగా కొందరు స్టార్డం ఉన్న హీరోస్ రాజకీయాల్లో కూడా రానిస్తున్నారు. తెలుగులో ఇప్పటివరకు బాలకృష్ణ ( Balakrishna ), మెగా స్టార్ చిరంజీవి ( Chiranjeevi), ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అందరి మాట ఏమో గానీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) మాత్రం ఇప్పుడు ఒకరాష్ట్రానికి ఉప ముఖ్య మంత్రి అయ్యాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఏం అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవు. ఇక పవన్ వీరాభిమాని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎంతగా ఆనందపడ్డారో మనకు తెలుసు.. మొదటి నుంచి పవన్ అంటే మాస్టర్ కు పిచ్చి. ఎవరు ఎమన్నా సహించేవాడు కాదు. తాజాగా పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
జానీ మాస్టర్ ( Johny Master) గురించి అందరికీ తెలుసు.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరితో పనిచేసారు. ఎన్నో హిట్ సినిమాల్లో పాటలను కంపోజ్ చేశాడు. పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గానే కాకుండా వీలు దొరికినప్పడు మెగా ఫ్యామీలిపై ఎనలేని ప్రేమను కురిపిస్తుంటాడు.. జనసేన పార్టీపై ఎవరైనా విమర్శలు, ఆరోపణలు చేస్తే తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈయన జనసేన పార్టీకి విధేయుడు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన ఆయనకు ప్రచార కమిటీలో బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆయన గోదావరి జిల్లాలతోపాటు పలు అసెంబ్లీ నియోజకవర్గంలో విరివిగా ప్రచారం చేసిన అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. అయితే ఈయన ఎక్కడ మీటింగ్ కు వెళ్లినా కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు.
తాజాగా ఓ మీటింగ్ కు వెళ్లిన ఈయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఏపీకి మీరు డిప్యూటీ సీఎం. 2029లో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి, 2034 సంవత్సరంలో దేశానికి ప్రధాని అవుతారు. ఇది రాసుకోండి. జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ జానీ మాస్టర్ జోస్యం చెప్పారు. అయితే ఈ వీడియో వైరల్ అవ్వడంతో కొందరు మెగా యాంటి ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ భజన ఏంటి సామి.. అప్పుడు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఇలాగే భజన చేసి ముంచేసారు. ఆయన ఏకంగా పార్టీనే తీసేసారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను మోసెసి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఎక్కడో తేడా కొడుతుందే అని ఆ వీడియో పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి..
కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు అందుకొన్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పలు అగ్ర హీరోలకు ఆయన నృత్యాలు సమకూరుస్తున్నారు. ఆయన చేసిన పాటలు అత్యంత పాపులారిటీని సాధించాయి..
2034 Pawan has a PM : Johnny master pic.twitter.com/YCHeYzqpd4
— Raju (@rajulike7) September 3, 2024