Jr.NTR: 23 ఏళ్ల తర్వాత.. దేవర మూవీకి సెంటిమెంట్.. హిట్ పక్కా..!

Jr.NTR..జూ. ఎన్టీఆర్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయి ఇమేజ్ సొంతం చేసుకున్నారు.. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వెండి తెరపై కనిపించక దాదాపు రెండు సంవత్సరాలు పైగానే అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ , ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. మరి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందో అంటూ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తుండగా.. సెప్టెంబర్ 27వ తేదీన సినిమాని విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఒక సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. ఇదే డేట్ ని ఫిక్స్ చేస్తే కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.. మరి ఆ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఎన్టీఆర్ సెంటిమెంట్ రిపీట్..

Jr.NTR: After 23 years.. Sentiment for Devara Movie.. Hit Pakka..!
Jr.NTR: After 23 years.. Sentiment for Devara Movie.. Hit Pakka..!

ఇకపోతే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరోకి కచ్చితంగా ఫ్లాప్ పడుతుందని ఒక సెంటిమెంట్ ఉంది.. ఇప్పటివరకు ఏ హీరో కూడా ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయలేకపోయారు.. పైగా ఇటీవల రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆచార్యతో ఫ్లాప్ చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో దేవర కంటెంట్ పై ఎంత నమ్మకం ఉన్నా సరే.. అభిమానులలో ఎక్కడో చిన్న భయం చుట్టుకుంది.. కానీ తాజాగా ఒక కొత్త సెంటిమెంట్ ని పట్టుకున్నారు ఎన్టీఆర్ అభిమానులు.. గతంలో ఎన్టీఆర్ సినిమాలు స్టూడెంట్ నెంబర్ వన్, జనతా గ్యారేజ్ , జై లవకుశ సినిమాలు సెప్టెంబర్ లోనే విడుదలై భారీ విజయాన్ని అందుకున్నాయి.. అందుకే దేవర కూడా సెప్టెంబర్ లోనే విడుదల కాబోతోందని కచ్చితంగా.. దేవర కూడా కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు అభిమానులు.. దీంతో పాటు ఎన్టీఆర్ హీరోగా ఫస్ట్ హిట్ కొట్టిన సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ కూడా 2001 సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. దీంతో 23 ఏళ్ల తర్వాత మళ్లీ అదే డేట్ కి దేవరా సినిమా విడుదల కాబోతుండడంతో కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. మరి చూడాలి దేవర సినిమాతో ఎన్టీఆర్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో..

దేవర సినిమా..

బాలీవుడ్ బ్యూటీ దివంగత నటీమణి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మొదటిసారి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో భారీ తారాగణం భాగం కానున్నట్లు సమాచారం.. ఇకపోతే ఇటీవలే చిత్ర బృందం థాయిలాండ్ లో ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ మధ్య పాట చిత్రీకరణకు బయలుదేరిన విషయం తెలిసిందే. ఇక అక్కడ పాట పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత మిగతా కథను పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎట్టకేలకు సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు