Jr NTR – Allu Arjun : ఇటు మెగా – అటు నందమూరి నుండి ఇద్దరూ వేరయ్యారు.. బయట బావా బామ్మర్దులయ్యారు..

Jr NTR – Allu Arjun : టాలీవుడ్ లో మెగా – నందమూరి ఫ్యామిలీ ల మధ్య ఒకప్పుడు కోల్డ్ వార్ ఏ రేంజ్ లో జరిగేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మధ్య కాలంలో కాస్త తగ్గినట్టే తెలుస్తుంది. పలు కార్యక్రమాల్లో ఈ ఫ్యామిలీ స్టార్ హీరోలు కలుస్తుండడం, పరస్పర అభివాదాలతో అభిమానుల మధ్య కూడా సందడి నెలకొంది. ముఖ్యంగా 2024 ఎన్నికల కారణంగా నందమూరి – మెగా ఫ్యామిలీ స్టార్స్ ప్రచారంలో ఒకటయ్యారు. కానీ అనూహ్యంగా కొంత కాలంగా ఈ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల మధ్యనే మనస్పర్థలు వస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి ఫ్యామిలీ (Nandamoori Family) లో బాలకృష్ణ – జూనియర్ ఎన్టీఆర్, అలాగే మెగా ఫ్యామిలీ లో అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ ల మధ్య మనస్పర్థలు, గొడవలు పీక్స్ కి చేరుకున్నాయని జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది.

Jr NTR - Allu Arjun separated from Mega - Nandamuri familys

నందమూరి – మెగా నుండి ఇద్దరూ వేరయ్యారు..

ఇక ఈ మధ్య జరుగుతున్న పరిణామాలతో ఈ రెండు ఫ్యామిలీ ల నుండి ఇద్దరు స్టార్ హీరోలు కూడా వేరయ్యారని తెలుస్తుంది. నందమూరి ఫ్యామిలీ ఈవెంట్స్ కి జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) కి ఆహ్వానం కూడా అందకపోగా, ఇటు ఎన్టీఆర్ కూడా దూరంగానే ఉంటున్నాడు. తాజాగా NBK50 ఇయర్స్ కి కూడా జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందకపోగా, ఈవెంట్ కి దూరంగా బెంగుళూర్ కి వెళ్ళిపోయాడు తారక్. ఇక ఇటు అల్లు అర్జున్ (Allu arjun) సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లాక్ డౌన్ నుండి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కి ఒక రకంగా దూరంగానే ఉంటున్నాడు. ఆ మధ్య ప్లాప్స్ వచ్చినపుడు మెగా ఫ్యామిలీ అని లెక్కలు మాట్లాడినట్టు స్పీచ్ లలో తెలుస్తూనే ఉంది. అన్నిటికి మించి ఎన్నికల ప్రచారంలో వైసిపి కి బన్నీ ప్రచారం చేయడంతో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ (Mega Family) కి పూర్తిగా దూరమయ్యాడు. ఫైనల్ గా మెగా ఫ్యామిలి నుండి బన్నీ వేరయ్యాడనే అనిపిస్తుంది.

- Advertisement -

ఫ్యామిలికి దూరమై, బయట బావా బామ్మర్దులయ్యారు..

ఇక నందమూరి నుండి తారక్, మెగా ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ వేరయి, వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ బావా, బామ్మర్దుల్లాగానే సోషల్ మీడియాలో పలకరించుకుంటున్నారని తెలిసిందే. బన్నీ బర్త్ డే కి తారక్ బావా అని, తారక్ బర్త్ డే కి లేదా ఏదైనా స్పెషల్ విష్ కి బన్నీ బావా అని పిలుచుకుంటూ ఉన్నారు. ఇక ఫ్యామిలీ ఈవెంట్స్ కి ఈ ఇద్దరూ హాజరు కాకుండా, బయట ప్రైవేట్ పార్టీలకు ఈ ఇద్దరూ కలుస్తూ ఉండడం వీరిద్దరి ఫ్యాన్స్ కి సంతోషాన్నిస్తున్నా, నందమూరి, మెగాభిమానులకు అసంతృప్తినే కలిగిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు