Jr NTR : షూటింగ్ పేరుతో ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని ఎగ్గొట్టిన తారక్… కట్ చేస్తే మళ్ళీ దొరికిపోయాడు

Jr NTR : ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త గా తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాగా నిన్న (జూన్ 12) ఉదయం 11.33 నిమిషాలకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేసారు. అలాగే పలు పలువురు కేంద్ర మంత్రులు, ఫిల్మ్ సెలెబ్రిటీలు ముఖ్య అతిథులుగా విచ్చేసారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొనడం జరిగింది. అయితే నందమూరి అభిమానుల కళ్ళు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వైపే చూశాయి. కానీ ప్రమాణ స్వీకారానికి తారక్ రాలేదు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా ఈ ప్రమాణ స్వీకార వేడుకకి రాలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడని అందుకే ఈ వేడుకకి రాలేదని అభిమానులు పలువురు అభిప్రాయ పడ్డారు. ఇక నిజంగానే ఎన్టీఆర్ (Jr NTR) దేవర షూటింగ్ లో ఉన్నట్టు తెలిసింది.

Jr NTR came to Hyderabad after shooting for Devara

ప్రమాణ స్వీకారానికి ఎగ్గొట్టడానికేనా ఇదంతా?

అయితే జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉండడం వల్లే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రాలేదని స్పష్టంగా తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం ఎన్టీఆర్ షూటింగ్ ముగించుకుని గోవా నుండి హైదరాబాద్ కి వస్తున్నట్టు తెలిసింది. కానీ కొందరి వాదన ప్రకారం ఎంత షూటింగ్ లో బిజీగా ఉన్నా, సొంత పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న వేడుక, అన్నిటికి మించి సొంత కుటుంబ సభ్యుల వేడుకకు కూడా రానంత బిజీయా అని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే మరోవైపు రామ్ చరణ్ బాబాయ్ కోసం గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆపుకుని మరీ ప్రమాణ స్వీకార వేడుకకు వచ్చాడు. అలాంటిది సొంత ఫ్యామిలీ అయిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రాకపోవడం ఏంటి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

అసలు ఎన్టీఆర్ కి ఆహ్వానమే అందలేదట!

అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ప్రమాణ స్వీకార వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కి అసలు ఆహ్వానమే అందలేదట. ఇండస్ట్రీ లో చాలా మంది ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. ఘట్టమనేని కుటుంబం నుండి ఆదిశేషగిరిరావు, అలాగే ఎన్టీఆర్ ఫ్యామిలీ కి దూరంగా ఉన్న ప్రముఖులు కూడా దర్శనమిచ్చారు అక్కడ. కానీ సొంత ఫ్యామిలీ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కి అసలు ఆహ్వానమే అందలేదంటే ఇది ఆశ్చర్యంగానే ఉందని చెప్పాలి. అయితే ఈ ప్రమాణ స్వీకార వేడుకలకి సంబంధించి అన్నీ బాలకృష్ణ దగ్గరుండి చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. మరి బాలయ్య కి తెలీకుండా ఇదంతా జరిగిందా? లేక తెలిసే జరిగిందా? దీంతో నందమూరి కుటుంబాల మధ్య మనస్పర్ధలు మరోసారి స్పష్టమయ్యాయి. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ అక్కడ లేని లోటు స్పష్టంగా తెలుస్తుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. మరి దీనిపై నందమూరి ఫ్యామిలీలో మళ్ళీ ఎవరైనా స్పందిస్తారా? లేక ఇంతటితో వదిలేస్తారా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు