Devara : పని పూర్తిచేసిన తారక్.. ఇక ఫ్యాన్స్ కూల్ అయిపోండి..

Devara : టాలీవుడ్ లో కల్కి2898AD తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”. కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని, ఇప్పయివరకు వచ్చిన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలని స్కై లెవెల్లో పెంచేసాయి. మధ్యలో పాటలు ట్రోల్ అయినా, వింటున్న కొద్దీ చార్ట్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి. ఇక అయితే సమ్మర్ లో రావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 27కి వాయిదా పడిన విషయం తెలిసిందే. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆ టైం కి అయినా వస్తుందా లేదా అన్న సందేహంలో ఉన్నారు. కానీ ఈ విషయంలో అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు తారక్.

Jr NTR has completed the shooting of Devara

పని పూర్తి చేసిన తారక్..

ఇక దేవరకి సంబంధించి ఎన్టీఆర్ (Jr NTR) తాజగా ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. దేవర సినిమాకి సంబంధించి తన వరకు షూటింగ్ పార్ట్ ని మొత్తం పూర్తి చేసానని ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో చెప్పుకొచ్చాడు. పార్ట్ వన్ కి సంబంధించి మొత్తం షూట్ పూర్తి చేసానని.. ఇది అద్భుతమైన ప్రయాణం అని, వచ్చే నెలలో కొటరాల శివ రూపొందించిన అద్భుతమైన ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇక రీసెంట్ గా జరిగిన షెడ్యూల్ లో ఆయుధ పూజకి సంబంధించిన సాంగ్ ని అలాగే ఫైట్ ని చిత్రీకరించారు. దీంతో ఫస్ట్ పార్ట్ కి సంబంధించి సినిమా పూర్తయిందని తారక్ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఇక ఫ్యాన్స్ కూల్ అయినట్టే…

ఇక దేవర (Devara) రిలీజ్ డేట్ విషయంలో అభిమానులు ఇప్పటివరకు సందిగ్ధం లో ఉండగా, ఇప్పుడు ఈ ట్వీట్ తో ఫాన్స్ ని కూల్ చేసాడు తారక్. షూటింగ్ ఫినిష్ అయిందని తారకే చెప్పేసాడు కాబట్టి ఇక నందమూరి అభిమానులు సినిమా అనుకున్న టైం కి ఖచ్చితంగా వస్తుందని ఫిక్స్ అయిపోయారు. ఇక తారక్ షూటింగ్ గురించిన ఈ విషయాన్నీ నైట్ షూట్ సెటప్‌ లో ఎన్టీఆర్ – కొరటాల శివ తో సెట్స్ లో ఉన్న పిక్ ని షేర్ చేస్తూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాతో సైఫ్ అలీఖాన్ టాలీవుడ్ లోకి విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. జాన్వీ కపూర్ కూడా దేవరతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు