Jr NTR : ఆ ఒక్క నిర్ణయం తారక్ కెరీర్‌పైనే దెబ్బపడేలా చేసింది… ఇప్పుడు హవా మొత్తం తగ్గినట్టేనా..?

Jr.NTR:టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టి సత్తా చాటుతో ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుడైన నటుడుగా పేరు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తన తాత ప్రతిభను సైతం గుర్తు చేస్తూ.. తిరుగులేని ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ తగ్గిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

Jr.NTR: Has Jr. NTR lost his temper..?
Jr.NTR: Has Jr. NTR lost his temper..?

ఎన్టీఆర్ ని పట్టించుకునే అభిమానే లేడా..

గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదలవుతుందంటే చాలు అభిమానులు తెగ హంగామా చేసేవారు.. ముఖ్యంగా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి సినిమా టీజర్, ట్రైలర్ విడుదల అయ్యేవరకు తెగ హడావిడి చేస్తూ ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో అవేమీ కనిపించలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ కు లోకల్ లో మాత్రం క్రేజ్ తగ్గిందనే విధంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా మొదటి భాగంలో నటిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఏప్రిల్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీకి పోస్ట్ పోన్ అయ్యింది. కానీ ఈ సినిమా గురించి పట్టించుకునేవారు లేరు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దేవర సినిమా ఎందుకు ఆలస్యం అవుతుందనే విధంగా కూడా అభిమానులు చర్చించుకోలేదని సమాచారం.

అందుకే ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారా..

అయితే గతంలో కూడా అల్లు అర్జున్ , ప్రభాస్ విషయంలో కూడా ఇలాగే జరిగితే చాలామంది దర్శక నిర్మాతలను అభిమానులు సైతం సోషల్ మీడియాలో నిలదీశారు. కానీ ఎన్టీఆర్ ను మాత్రం ఇలా పట్టించుకునే అభిమానులే లేరనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇందుకు ముఖ్య కారణం సోషల్ మీడియాలో పలువు అభిమానులు తెలిపిన సమాచారం ప్రకారం.. గతంలో ఎన్టీఆర్ సినిమా విడుదలవుతోందంటే టిడిపి పార్టీ ఆఫీసును కేంద్రంగా కొంతమంది వీరాభిమానులు పనిచేసేవారట.. కానీ కొన్నేళ్లుగా మారిన పరిస్థితులను బట్టి వీరు దూరమయ్యారు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

నిజా నిజాలు ఏంటంటే..

ముఖ్యంగా టిడిపి పార్టీకి సపోర్ట్ చేయలేదని.. చాలామంది నేతలు ఎన్టీఆర్ పైన కోపంగా ఉన్నారు. అంతేకాకుండా ఇటీవలే ఏపీ అసెంబ్లీ సమావేశాలలో కూడా బిజెపి ఎమ్మెల్యే సత్య ప్రకాష్ కూడా ఇన్ డైరెక్టుగా ఎన్టీఆర్ గురించి ప్రస్తావించడం జరిగింది.. దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ చేసిన ఈ తప్పు వల్లే ఎన్టీఆర్ గ్రాఫ్ తగ్గిపోయిందనే విధంగా పలువురు నేతలు తెలియజేస్తున్నారు.. అయితే ఈ విషయాన్ని మాత్రం ఎన్టీఆర్ డైహార్ట్ ఫాన్స్ మాత్రం అసలు ఒప్పుకోలేదు… కేవలం కావాలని కొంతమంది నాయకులు ఇలా మాట్లాడుతున్నారని, అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.. తమ హీరో రాజకీయాలలోకి ఇప్పుడే రాదలుచుకోలేదు కాబట్టే రాజకీయాల గురించి దూరంగా తమ హీరో ఉంటున్నారనే విధంగా అభిమానులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ను పట్టించుకోవడం లేదు అంటూ వస్తున్నా వార్తలు అభిమానులను మరింత నిరాశకు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు