Jr NTR on Sr NTR: తెలుగు దేశం చిన్నబోతుంది… పెద్ద మనసుతో మళ్లీ రా.. తాతా

Jr NTR on Sr NTR: నందమూరి తారక రామారావు ఇది కేవలం పేరు కాదు ప్రభంజనం. ఒక గొప్ప నటుడుగా, ప్రజానాయకుడు గా తెలుగు జాతికి ఎన్నో సేవలు అందించారు. తెలుగువారు అంత ఆయనను “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకుంటారు. తెలుగు, తమిళం, హిందీ,గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించారు ఎన్టీఆర్. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. నేడు జయంతి సందర్భంగా పలువురు నివాళులు అర్పిస్తున్నారు.

తండ్రి లెగసీని కొంతవరకు కొనసాగించిన బాలకృష్ణ

ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక క్రికెట్ టీం కి ఉన్నంత సభ్యులు ఈ కుటుంబంలో ఉన్నారు అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ కుమారుల్లో నందమూరి బాలకృష్ణ సినిమాల్లో కొనసాగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. కేవలం సినీ పరిశ్రమంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తన సత్తాను చాటారు బాలకృష్ణ. ఇక ప్రస్తుతం అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ వరుస విజయాలను సొంతం చేసుకొని మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్నారు. మరోవైపు రాజకీయాల్లో కూడా మంచి బిజీగా ఉన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కీలకపాత్రలో కొనసాగుతున్నారు. అయితే ఆ పార్టీ బాలకృష్ణ ఆధీనంలో ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు.

NT Rama Rao

- Advertisement -

ఎన్టీఆర్ మూడవ తరం

ప్రస్తుతం ఈ జనరేషన్లో ఎన్టీఆర్ అనగానే పక్కన గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంచలంచలుగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సాధించుకున్నాడు. అయితే ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఎప్పుడూ కూడా నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ను అంతగా పట్టించుకోలేదు. ఎన్టీఆర్ ను ట్రీట్ చేసే విధానం కూడా వేరేగా ఉండేది. అయితే ఎన్టీఆర్ కి సక్సెస్ రావడంతో చాలామంది ఎన్టీఆర్ ను దగ్గరికి తీసుకోవడం మొదలుపెట్టారు. 2009 ఆ ప్రాంతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున జోరుగా ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత తండ్రి హరికృష్ణ మరణం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొన్ని విషయాల పైన ఎన్టీఆర్ స్పందించకపోవడంతో చాలామంది ఎన్టీఆర్ వ్యతిరేకంగా విమర్శలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు.

ఒక్క ట్వీట్ తో అందరికీ సమాధానం ఇచ్చాడు

ఇకపోతే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం చివరి దశలో ఉందని, ఈ పార్టీని మళ్లీ నిలబెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ రావాలని వైసిపి నాయకులు అంటూ ఉంటారు. ఇదే ఉద్దేశం చాలా మందికి కూడా ఉంది అని చెప్పొచ్చు. అయితే రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ సంబంధించి ఒక ట్వీట్ కానీ ఒక స్పీచ్ కానీ ఇవ్వలేదు జూనియర్ ఎన్టీఆర్. రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. ఈ విషయంపై చాలామంది టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం కూడా చేశారు. ఇక రీసెంట్ గా టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీపై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, నారా లోకేశ్‌ని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని అన్నారు. ఇది తన డిమాండ్ అని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ 2014 , 2019 , 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేయలేదని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీడీపీ బాధ్యతలు నారా లోకేష్ కు అప్పగించాలన్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాబట్టి వారసత్వంగా ఆ పార్టీని నిలబెట్టే బాధ్యత కూడా జూనియర్ ఎన్టీఆర్ కు ఉంది. అయితే ఇప్పటివరకు దీని గురించి స్పందించలేదు ఎన్టీఆర్ ప్రస్తుతం అందరికీ దీటైన సమాధానంగా ఒక ట్వీట్ ను వదిలారు. ” మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా..” అంటూ ఎప్పటిలానే ట్వీట్ చేశాడు తారక్. ఇకపోతే “తెలుగు దేశం చిన్నబోతుంది… పెద్ద మనసుతో మళ్లీ రా.. తాతా” అంటూ ఇన్ డైరెక్ట్ గా ఇప్పుడున్న నాయకులను టార్గెట్ చేశాడు తారక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు