Jr.NTR: ఆ స్టార్ హీరోల సాయం.. తారక్ రుణం తీర్చుకున్నారా..?

Jr. NTR.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రభంజనం సృష్టించిన ఎన్టీఆర్ ఇప్పుడు మరొకసారి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే సెప్టెంబర్ 27వ తేదీన కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవర సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్ అన్నీ కూడా అదరగొట్టేసాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈయనకు సంబంధించిన పాత విషయాలు మళ్లీ వైరల్ గానే మారుతున్నాయి. ఈయన ఒక ముగ్గురు స్టార్ హీరోల నుంచి సహాయం పొందారని, వారి రుణాన్ని కూడా తీర్చుకున్నారని సమాచారం. మరి ఏంటా సహాయం? ఎలా వారి రుణం తీర్చుకున్నారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

Jr.NTR: With the help of those star heroes.. did Tarak pay off his debt..?
Jr.NTR: With the help of those star heroes.. did Tarak pay off his debt..?

బాద్షా మూవీ జీవితంలో మరిచిపోలేని అనుభూతి..

సాధారణంగా ప్రతి ఒక్క హీరోకి కూడా తమ కెరియర్ లో కొన్ని అరుదైన తీపి జ్ఞాపకాలు ఉంటాయి. ఎన్టీఆర్ కి కూడా ఒక చిత్రంతో మరిచిపోలేని అనుభూతి ఉంది. అదే బాద్షా.. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ తో పాటు బ్రహ్మానందం కామెడీ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ ఈ సినిమా విశేషాలను గుర్తు చేసుకున్నారు.

ఎన్టీఆర్కు సహాయం చేసిన ముగ్గురు స్టార్ హీరోలు..

బాద్షా చిత్రం కోసం ఒక ముగ్గురు స్టార్ హీరోలు తమ వంతు సహాయం అందించారు. అది కూడా ఏమీ ఆశించకుండా అని తెలిపారు. ఇక వారెవరు అంటే ఈ సినిమా ఓపెనింగ్ కి రామ్ చరణ్ హాజరై ఎన్టీఆర్ పై ఫస్ట్ క్లాస్ ఇచ్చారు. రామ్ చరణ్ చేతుల మీదుగానే ఈ సినిమా ప్రారంభమైంది .అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమాకి తన వాయిస్ ఓవర్ అందించారు. తారక్ తో ఉన్న అనుబంధం శ్రీను వైట్లతో ఉన్న స్నేహబంధం కారణంగా మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాకి తన వంతు సహాయం అందించిన మరో హీరో సిద్ధార్థ్. ఇందులో కామెడీ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. అంతే కాదు ఎన్టీఆర్ పైన ఉన్న ఇష్టంతోనే ఆ రోల్ చేసాడు సిద్ధార్థ్. అలా ఈ ముగ్గురు కూడా ఏమీ ఆశించకుండానే ఎన్టీఆర్ కు సహాయాన్ని అందించారు.

- Advertisement -

వారి రుణం తీర్చుకున్న ఎన్టీఆర్..

అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ తనకు సహాయాన్ని అందించిన ఈ ముగ్గురికి కూడా సహాయం చేసి రుణం తీర్చుకున్నారు. చరణ్ ఎన్టీఆర్ కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించారు. అలాగే మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. ఇక త్వరలో సిద్దార్థ్ రుణం కూడా తీర్చుకోబోతున్నారు ఎన్టీఆర్. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో హెల్తీ ఫ్రెండ్షిప్ కొనసాగడం చాలా ముఖ్యమని చెప్పారు ఎన్టీఆర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు