Devara : సాలిడ్ మాస్ పోస్టర్ తో దేవర ట్రైలర్ డేట్ ఇచ్చిన మేకర్స్..

Devara : జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ (Koratala Shiva) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. నందమూరి అభిమానులతో సహా మూవీ లవర్స్ కళ్ళు కాయలు కాచేలా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ కూడా సినిమాపై అంచనాలని స్కై లెవెల్లో పెంచేయగా, రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇటు పాటలు కూడా ట్రోల్ అయినా వింటున్న కొద్దీ కిక్కెక్కిస్తున్నాయి. ఇక దేవర షూటింగ్ ఆల్మోస్ట్ మొత్తం పూర్తయిపోగా, చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్లలో వేగం పెంచింది. ఇక దేవర (Devara) సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా దేవర ట్రైలర్ గురించి కన్ఫర్మేషన్ ఇస్తూ చిత్ర యూనిట్ ఒక సాలిడ్ పోస్టర్ ని వదిలింది.

JR NTR's Devara Movie Trailer Update

ఆయుధంతో యుద్ధానికి సిద్ధమైన “దేవర”…

ఇక దేవర మూవీ యొక్క ట్రైలర్ ని సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తారని వారం రోజుల నుండే వార్తలు వస్తుండగా, అదే డేట్ ని కంఫర్మ్ చేస్తూ చిత్ర యూనిట్ తాజాగా క్రేజీ పోస్టర్ రిలీజ్ చేస్తూ అనౌన్స్ చేసింది. ఇక ఆ పోస్టర్ లో దేవర గా ఎన్టీఆర్ (Jr NTR) లుక్ మామూలుగా లేదు. సముద్రం అలల దగ్గర నిల్చుని నల్లటి వస్త్రాలతో పంచ కట్టుపై ఉన్న ఎన్టీఆర్ లుక్ ని రిలీజ్ చేయగా, చేతిలో పూజ చేసిన తన ఆయుధంతో నిల్చుని యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా పోస్టర్ ఉంది. ఇక ఈ స్టిల్ ఆయుధ పూజ కి సంబంధించింది అని తెలుస్తూనే ఉంది, కాగా ట్రైలర్ ని సెప్టెంబర్ 10న కంఫర్మ్ చేయగా, సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య రిలీజ్ చేసే అవకాశం ఉంది.

- Advertisement -

ట్రైలర్ తో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడా?

ఇక దేవర ట్రైలర్ (Devara Trailer) కోసం మూవీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తుండగా, దేవర ట్రైలర్ తో తారక్ కొత్త రికార్డ్స్ సృష్టిస్తాడని అంటున్నారు నెటిజన్లు. ఇక ఇంతకు ముందు ట్రైలర్ పరంగా హైయెస్ట్ వ్యూస్ సలార్ (Salaar) ట్రైలర్ కి ఉండగా దాన్ని దేవర బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక సినిమాపై భారీ అంచనాలు పెరగడానికి అన్నిటికంటే పెద్ద ఆయుధం కూడా దేవర ట్రైలర్ అనే చెప్పాలి. అన్ని భాషలపై ఒకేసారి అటెన్షన్ రావాలంటే దేవర ట్రైలర్ ఎంత సాలిడ్ గా ఉంటే అంత బజ్ పెరుగుతుంది. ఇక దేవర సినిమాతో డే వన్ కే 150 కోట్ల ఓపెనింగ్స్ కొట్టాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు