Jr NTR and Kalyan Ram on TDP : అన్నదమ్ముల రియాక్షన్‌పై అనుమానాలెన్నో… నందమూరి ఇంట్లో పరిస్థితి మరి ఇంత దారుణంగా ఉందా…?

Jr NTR and Kalyan Ram on TDP : తెలుగుదేశం పార్టీలో నందమూరి హరికృష్ణ ఒక కీలక పాత్రను పోషించారు. తన కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు సపోర్ట్ అందించారు. వారికి నారా ఫ్యామిలీతో ఎప్పటినుంచో కొన్ని అభిప్రాయ బేధాలు ఉన్నాయని విషయం తెలిసిందే. అయితే 2009లో తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ ముందుకు వచ్చి ప్రచారం చేశాడు. అప్పటి ఎలక్షన్స్ లో ఎన్టీఆర్ కీలకపాత్రను పోషించాడు. ఆ తర్వాత తనకు తానుగా తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించలేదు. 2014లో కూడా సైలెంట్ గానే ఉన్నాడు తారక్.

Junior NTR and Kalyan Ram's reaction on TDP's victory in AP elections
Junior NTR and Kalyan Ram’s reaction on TDP’s victory in AP elections

ఇకపోతే ఎన్టీఆర్ను కళ్యాణ్ రామ్ ను నారా ఫ్యామిలీ ఎప్పటినుంచి దూరం పెడుతూ వస్తుంది. ఇకపోతే నారా లోకేష్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కీలకపాత్రను పోషిస్తున్నారు. అయితే ఇది చాలామందికి నచ్చడం లేదు. తెలుగుదేశం పార్టీకి అసలైన వారసులు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ అంటూ చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. రీసెంట్ టైమ్స్ లో వీరిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమాలలో పాల్గొనలేదు. చాలామంది సపోర్టుగా మాట్లాడినా కూడా వీరు మాత్రం స్పందించలేదు.

Junior NTR and Kalyan Ram's reaction on TDP's victory in AP elections
Junior NTR and Kalyan Ram’s reaction on TDP’s victory in AP elections

ఇకపోతే రీసెంట్ గా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. దీనిపై మొదటిసారి స్పందించాడు ఎన్టీఆర్. ప్రియమైన నారా చంద్రబాబు నాయుడు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన భరత్ కి, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అంటూ ట్విట్ చేశారు ఎన్టీఆర్. అయితే దీనిపై చాలామంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. పార్టీ సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు కానీ ఇప్పుడు మాత్రం మావయ్య అత్తయ్య అంటూ ట్వీట్ చేశాడంటూ కొంతమంది కళ్యాణ్ రామ్ ను, ఎన్టీఆర్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

- Advertisement -

ఇకపోతే ఇద్దరు అన్నదమ్ముల నుంచి ఒకే రకమైన ట్వీట్ రావడంతో చాలా అనుమానాలకు దారితీస్తుంది. విజయం సాధించిన ఇంతసేపటి వరకు విషెస్ చెప్పకపోవడం. ఇద్దరూ కలిసి అనుకుని చెప్పారా అంటూ కొంతమంది ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ పార్టీ విజయం సాధించినా కూడా ఏదో ఒక రోజు ఈ పార్టీ పగ్గాలను వీళ్లే తీసుకొని నడిపిస్తారని చాలామందికి గట్టి నమ్మకం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు