NTR: తెలంగాణ హై కోర్టుకు జూనియర్ ఎన్టీఆర్ !

జూనియర్ ఎన్టీఆర్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ల్యాండ్‌ విషయంలో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం మొత్తం ఎన్టీఆర్ కు చుట్టుకుంది. 2003లో గీత లక్ష్మీ అనే వ్యక్తి నుంచి ప్లాట్ కొనుక్కున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే… అప్పటికే 1996 నుంచి పలు బ్యాంకుల వద్ద గీత లక్ష్మి కుటుంబం…ఈ ప్లాట్‌ పై లోన్స్‌ తీసుకుందట. కానీ జూనియర్ ఎన్టీఆర్ కు అమ్మే సమయంలో ఈ విషయాన్ని చెప్పలేదట గీత లక్ష్మి.

దీంతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చిక్కుల్లో పడ్డాడు. జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసిన ఫ్లాట్‌ పై ఐదు బ్యాంకుల నుంచి లోన్‌ తీసుకుందట గీత లక్ష్మి. కానీ ఒకే బ్యాంకు తీసుకున్నట్లు చెప్పిందట గీత. అయితే.. ఆ లోన్‌ ను జూనియర్ ఎన్టీఆర్ క్లియర్‌ చేసి.. ప్లాట్‌ కు మనీ చెల్లించాడట. ఈ తరుణంలో 2003 నుంచి ప్లాట్ ఒనర్ గా జూనియర్ ఎన్టీఆర్ కొనసాగుతున్నాడు.

అయితే.. అప్పటి నుంచి పాత బకాయిలు వసూలు చేసుకునేందుకు బ్యాంకులు వచ్చాయి. అంతేకాదు ఆ ప్రాపర్టీ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు బ్యాంక్ మేనేజర్లు. దీంతో బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే… తాజాగా DRT లో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటీషన్‌ వేశాడు. ఇక ఈ పిటీషన్‌ పై జూన్ 6న విచారణ చేయనుంది హైకోర్టు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు