Jr Ntr : ఆ డైరెక్టర్స్ అంటే ఎన్టీఆర్ కు అంత భయమేంటో.. ఇండస్ట్రీలో టాక్ ఎంటంటే ?

Jr Ntr : నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.. తన తండ్రి వారసత్వంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా కూడా తన నటన , టాలెంట్ తో ఆస్కార్ స్థాయికి ఎదిగాడు.. ఒక్కో సినిమాలో ఒక్కో వేరియంట్ లో కనిపిస్తూ తన అభినయంతో అభిమానవుల మనసు దోచుకున్నాడు.. గతంలో ఎన్ని హిట్ సినిమాలు వచ్చినా కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకురాలేదు. కానీ ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.. అలాంటి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోని కొందరు డైరెక్టర్స్ ను భయపడుతున్నారట. అసలేందు అలా ఎన్టీఆర్ ఫీల్ అవుతున్నాడో కాస్త వివరంగా తెలుసుకుందాం..

ఎన్టీఆర్ సినిమాలతో చాలా మంది డైరెక్టర్స్ హ్యాట్రిక్ హిట్ కొట్టారు. అందులో రాజమౌళి , వివి వినాయక్ వంటి స్టార్ డైరెక్ట్సర్స్ కూడా ఉన్నారు. వీళ్ళతో సినిమాలు ఎప్పుడు చేసిన ఎన్టీఆర్ క్రేజ్ తగ్గదు. రాజమౌళి డైరెక్ట్ చేసిన ట్రిపుల్ ఆర్ సినిమానే ఎన్టీఆర్ కు మంచి పేరును అందించింది. అలాగే ఫ్లాఫ్ డైరెక్టర్స్ టాలెంట్ ను గుర్తించి ఎంకరేజ్ చేస్తుంటాడు ఎన్టీఆర్. అయితే ఒకప్పుడు ఫ్లాప్ డైరెక్టర్స్ తో చేసిన సినిమాలు హిట్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆయన రేంజ్ కు పెద్ద డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తేనే బెస్ట్ అని కొందరు అభిప్రాయం పడుతున్నారు..

Junior NTR is afraid of those director's films
Junior NTR is afraid of those director’s films

ఇక ఎన్టీఆర్ ఆ ఇద్దరు డైరెక్టర్స్ తో సినిమాలు చెయ్యాలంటే భయపడుతున్నారనే వార్త తాజాగా ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఆ ఇద్దరు ఎవరో కాదు. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్,మరొకరు హాయ్ నాన్న ఫేమ్ శౌర్యవ్.. వీరిద్దరూ చేసిన సినిమాలు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. కానీ వీరితో సినిమాలు అంటే ఎన్టీఆర్ ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది. వారితో గతంలో సినిమాలు చేద్దామని అనుకోని మరి ఎన్టీఆర్ డ్రాప్ అయ్యినట్లు తెలుస్తుంది. ఇంటర్నేషనల్ స్టార్ ఎన్టీఆర్ వారితో సినిమాలు చేస్తే అవి హిట్ అయినా కూడా అతని ఫేమ్ రాదని భయపడుతున్నాడని టాక్.. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కొరటాల శివ కాంబోలో దేవర సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు. వీటితో పాటుగా ప్రశాంత్ నీల్ తో ఓ చేయబోతున్నాడని టాక్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు