Jyothi Poorvaj : కొత్త అవతారం ఎత్తిన జ్యోతి రాయ్.. మొన్న అలా.. నేడు ఇలా..

Jyothi Poorvaj : బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి కొందరు సినిమాల్లో అవకాశాలను అందుకుంటారు.. అలా ఇప్పుడు సినిమాల్లో బిజీ అవుతున్న హీరోయిన్ జ్యోతి రాయ్.. ఈ పేరుతో చెబితే చాలా మందికి తెలిసి ఉండదు.. కానీ జగతి మేడమ్ అంటే ఇట్టే గుర్తుపడతారు.. ఈ అమ్మడు సీరియల్స్ కు గుడ్ బై చెప్పేసి, సినిమాల్లో హీరోయిన్ గా వరుస అవకాశాలను అందుకుంటుంది.. ఇక సోషల్ మీడియాలో పాప ఎంత అందంగా ఉంటుందో తెలుసు.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది.. కానీ తాజాగా డివోషనల్ మోడ్ లోకి తీసుకెళ్ళింది.. అమ్మవారిగా కొత్త అవతారం ఎత్తింది.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఈమె బాయ్ ఫ్రెండ్ సుకు పూర్వజ్.. ‘ఏ మాస్టర్పీస్’కు డైరెక్టర్గా వ్యవహరించాడు. దీంతో ఇందులో జ్యోతికి కూడా నటించే అవకాశం దక్కింది.. ఆమె ప్రస్తుతం టాలీవుడ్ లో నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తుంది.. అలాంటి ఈమె సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఏ మాస్టర్పీస్’ అనే సినిమాతో ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ మూవీలో అరవింద్ కృష్ణ ఇందులో హీరోగా నటించాడు. ఈ మూవీ టీజర్ను బట్టి అరవింద్ కృష్ణ తల్లి పాత్రలో జ్యోతి రాయ్ నటించనుందని తెలుస్తోంది..

jyothi poorvaj birth day special movie poster release
jyothi poorvaj birth day special movie poster release

తాజాగా జ్యోతిరాయ్ బర్త్ డే సందర్బంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.. ఆ పోస్టర్ లో జ్యోతి రాయ్ అమ్మవారిగా కనిపిస్తుంది.. ప్రస్తుతం పోస్టర్ ఆసక్తికరంగా మారింది.. ఇక ఈ సినిమా నుంచి పోస్టర్లు, టీజర్ తప్పా ఇంకా ఏ అప్డేట్ బయటికి రాలేదు. కొన్నిరోజుల క్రితం విడుదల చేసిన టీజర్లో కూడా అసలు కథ ఏంటి అని పూర్తిగా రివీల్ చేయలేదు మేకర్స్. హీరోకు సూపర్ పవర్స్ వస్తాయని, ఆ తర్వాత తను కొంతమందిని ఎదిరించడానికి ముందుకొస్తాడనే విషయం మాత్రమే క్లారిటీ వచ్చింది.. మోడ్రన్ గా కనిపించే ఈమె ఇలా అమ్మవారి పాత్ర వెయ్యడం పై కొందరు అభ్యంతరం తెలుపుతున్నట్లు తెలుస్తుంది.. మరి సినిమాలో ఎలా ఉండబోతుందో చూడాలి..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు