Jyothi: వాళ్ల కోరికలు తీర్చలేదనే నాపై పగబట్టారు.. నటి జ్యోతి హాట్ కామెంట్స్..!

Jyothi.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా బోల్డ్ , వ్యాంప్ పాత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి జ్యోతి.. ఎన్నో చిత్రాలలో తన కామెడీ టైమింగ్ తో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొదట పెళ్ళాం ఊరెళితే సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఏమి చేసిన తప్పు కూడా ఇదే.. అవకాశాల కోసం ఇలాంటి పాత్రలలో నటించిన జ్యోతి ఇక అప్పటి నుంచి చాలామంది దర్శకనిర్మాతలు జ్యోతికి ఎక్కువగా వ్యాంప్ పాత్రలే ఇచ్చేవారట. అయితే ఈ పాత్రలో నటించడం ఇష్టం లేక నెమ్మదిగా సినీ ఇండస్ట్రీ నుంచి దూరమయింది.

సె** రాకెట్ లో ఇరికించినా.. కోర్టు నుండి నిర్దోషిగా బయటకి..

Jyothi: They resented me for not fulfilling their wishes.. Actress Jyothi hot comments..!
Jyothi: They resented me for not fulfilling their wishes.. Actress Jyothi hot comments..!

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతి తన సినీ కెరియర్ లో జరిగినటువంటి కొన్ని విషయాలను తెలియజేసింది. ఒకానొక సమయంలో తను ఎన్నో ఇబ్బందులలో చిక్కుకున్నాను.. వివాదాలలో ఇరుక్కున్నానని తెలిపింది.. ముఖ్యంగా సె** రాకెట్ లో కూడా ఈమె ఇరుక్కున్నది.. అయితే తాజాగా ఈ విషయంపై నోరు విప్పి మాట్లాడింది జ్యోతి… తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతి మాట్లాడుతూ… నాపై కొంతమంది పగ పట్టారు. వారి నన్ను ఇలాంటి కేసుల్లో ఇరికించారు.. కానీ ఈ విషయంలో నేను కోర్టు వరకు వెళ్లి అందులో నుండి పూర్తి నిర్దోషిగా నేను బయటపడ్డాను..

కోరికలు తీర్చలేదని అందులో ఇరికించారు..

అయితే ఎవరి కోరికలైతే నేను తీర్చలేదో వారే నాకు అవకాశాలు రాకుండా చేసి.. నన్ను ఇలాంటి వివాదాల్లో ఇరికించారు.. సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఎలా మారిపోయింది అంటే… ఒక అమ్మాయి కమిట్మెంట్ కి ఒప్పుకుంటే మంచిదని.. కమిట్మెంట్ కి ఒప్పుకోకపోతే ఆమె క్యారెక్టర్ చెడ్డది అంటూ వార్తలు వైరల్ చేస్తారు.. ఒక అమ్మాయి అలాంటి పనికి ఒప్పుకుంది అంటే కేవలం ఆమె సుఖం కోసమో లేక డబ్బుల కోసమో కాదు.. ఫ్యామిలీ కోసం కూడా.. తప్పని పరిస్థితుల్లో అలాంటి పని చేయాల్సి వస్తుంది.. దానిని మీరు ఒకసారి ఆలోచించాలి.. అమ్మాయి ఏం చేసినా సరే తన చుట్టూ ఉండే వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని భావిస్తుంది కానీ ఆమె చేసే పనిని తప్పుపడుతూ రకరకాలుగా సృష్టిస్తారు.. ఇక నేను ఇలాంటి పనులు ఏవి చేయకుండానే నాపైన ఇలాంటి చెడు ముద్రలు వేశారు.. ముఖ్యంగా టాలీవుడ్ లో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు.. వారి వల్లే సినిమా ఇండస్ట్రీ మొత్తం పాడైపోతుంది అంటూ జ్యోతి తన మనసులో మాటగా చెప్పుకొచ్చింది.. ఇకపోతే అప్పట్లో ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

బిగ్ బాస్ లో కూడా సందడి..

జ్యోతి సినిమాలే కాదు బుల్లితెరపై కూడా సందడి చేసింది. ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ హౌస్ లో కూడా అడుగుపెట్టిన ఈమె కంటెస్టెంట్ గా తనదైన ఆట తీరుతో మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ తర్వాత ఈమె క్రేజ్ పెరిగి.. అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఇలాంటి కారణాల వల్ల తనకు అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు స్మాల్ స్క్రీన్ లో అవకాశాలు రాకుండా చేశారని బాధపడింది జ్యోతి.. ఏది ఏమైనా జ్యోతి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు