KA Teaser: ఇదేదో వర్కౌట్ అయ్యేటట్లు ఉంది

KA Teaser: ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాణించాలి అంటే అది సాధారణమైన పని కాదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తే గాని ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కేవి కాదు. రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియా బాగా పాపులర్ అవడం వలన చాలామంది తెలుగు సినిమా పరిశ్రమలో నటులుగా నిలబడుతున్నారు. చాలామంది షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి నటులుగా తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇక ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసి రాజా వారు రాణి గారు సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. చాలా తక్కువ బడ్జెట్ తో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. మంచి హిట్ అవడంతో పాటు విమర్శకులు ప్రశంసలను కూడా అందుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రహస్య గోరక్ హీరోయిన్ గా నటించింది.

రాజావారు రాణి గారు సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం చేసిన సినిమా ఎస్సార్ కళ్యాణ్ మండపం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. కోవిడ్ టైం లో వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. అయితే ఈ సినిమాతోనే కిరణ్ అబ్బవరంలో ఉన్న రైటర్ కూడా బయటకు వచ్చాడని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత కిరణ్ సరైన హిట్ సినిమాను ఇప్పటివరకు చేయలేదు.

Kiran Abbavaram

- Advertisement -

ఈ సినిమా తర్వాత ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సెబాష్టియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత చేసిన సమ్మతమే సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. ఆ తర్వాత ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన “నేను మీకు బాగా కావాల్సిన వాడిని” సినిమా కూడా ఊహించిన విజయాన్ని సాధించలేదు. అయితే గీత ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన “వినరో భాగ్యము విష్ణు కథ” సినిమా మంచి అంచనాలతో రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ పాలు అయింది. ఆ తర్వాత చేసిన మీటర్, రూల్స్ రంజన్ వరుసగా డిజాస్టర్ గా మిగిలాయి.

20 కోట్ల బడ్జెట్ తో

ఇకపోతే రీసెంట్ గానే ఒక సినిమాను అనౌన్స్ చేశాడు కిరణ్. ఈ సినిమా టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో ఒక పోస్ట్ మాన్ పాత్రలో కిరణ్ కనిపిస్తున్నాడు అందరి ఉత్తరాలను సీక్రెట్ గా చదువుతుంటాడు కిరణ్. ఈ సినిమాలోని విజువల్స్ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ సినిమాను ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది.ఈ సినిమా దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. కిరణ్ కెరియర్ లో ఇదే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఉత్తరం పైన లెటర్స్ రాస్తూ అప్డేట్ ఇస్తూ వచ్చారు ఇలా ఇవ్వడానికి కారణం ఈ సినిమాలో కిరణ్ పోస్టుమెన్ రోల్ లో కనిపించడమే. ఏదేమైనా ఈ సినిమా సక్సెస్ అయితే కిరణ్ అబ్బవరం మళ్లీ ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు