Kabzaa : కేజీఎఫ్ లాంటి హై యాక్షన్

ఒకప్పుడు కన్నడ సినిమాలకు ఇతర ఇండస్ట్రీలలో అంతగా గుర్తింపు ఉండేది కాదు. కానీ “కేజిఎఫ్” సినిమాతో కన్నడ ఇండస్ట్రీ పేరు దేశమంతటా మార్మోగిపోయింది. దీనికి కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కంటెంట్ ఉన్న కథలను తెరకెక్కిస్తూ పాన్ ఇండియా స్థాయిలో హిట్లు కొడుతున్నారు. ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం విక్రాంత్ రోనా కూడా ఇండియా లెవెల్ లో మంచి విజయం సాధించింది. తాజాగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ మూవీ ” కబ్జా”. ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ మూవీ కేజిఎఫ్ తర్వాత ఆ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కింది.

ఇప్పటికే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, గ్లింప్స్ తో ఆకట్టుకున్న కబ్జా మూవీ నుండి తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు మూవీ యూనిట్. రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఈ టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ లో విజువల్స్, సెట్టింగ్స్ కేజీఎఫ్ మూవీ రేంజ్ లో ఉన్నాయి. ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్ పై పోటాపోటీగా నటించడంతో సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీీ పెరిగింది. ఈ టీజర్ చూస్తుంటే మళ్ళీ కేజీఎఫ్ లాంటి హై యాక్షన్ సినిమాను కన్నడ నుండి చూడబోతున్నట్లులు తెలుస్తోంది.

1947 నుండి 1984 మధ్య ఈ సినిమా మధ్య ఈ సినిమా కథ జరుగుతుందట. అనుకోని పరిస్థితులలో ఓ స్వతంత్ర సమరయోధుడి కొడుకు మాఫియా ప్రపంచంలో చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో ఏడు భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రియా శరన్ కథానాయిక గా నటిస్తోంది. మరి కేజిఎఫ్ తరహాలోనే ఈ మూవీ కూడా సంచలనాలను సృష్టిస్తుందో లేదో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు