Kaikala Sathynarayana: కైకాల కి కేజీఎఫ్ మూవీ తో వున్న సంబంధం ఏంటో తెలుసా.?

Kaikala Sathynarayana..తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లెజెండ్రీ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కైకాల సత్యనారాయణ ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఘటోత్కచుడు పాత్ర ఈయనకు మరింత పేరు తెచ్చిపెట్టింది. ఇలా ఒక్కటేమిటి విలన్ గా, కమెడియన్ గా ఎన్నో పాత్రలు పోషించి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. సుమారుగా 700కు పైగా చిత్రాలలో నటించిన కైకాల సత్యనారాయణ వయోభారంతో డిసెంబర్ 23 2022న స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఆయన మరణం సినీ ఇండస్ట్రీని కలచివేసింది. ఎంతోమంది దర్శక నిర్మాతలు, హీరోలు ఆయన మరణాంతరం ఆయన పార్తివదేహాన్ని సందర్శించి , ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

Kaikala Sathynarayana: Do you know what Kaikala has to do with KGF movie
Kaikala Sathynarayana: Do you know what Kaikala has to do with KGF movie

కే జి ఎఫ్ చిత్రంతో కైకాల కు సంబంధం..

ఇదిలా ఉండగా ఈరోజు ఆయన జయంతి.. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాహుబలి సినిమా తర్వాత అత్యంత క్రేజ్ దక్కించుకున్న చిత్రం కేజిఎఫ్. కన్నడ నుంచి కూడా అద్భుతమైన సినిమాలు వస్తాయని ఈ సినిమా నిరూపించింది. ముఖ్యంగా బాహుబలి 2 కోసం అప్పట్లో ఆడియన్స్ ఇంతలా ఎదురు చూశారో కేజీఎఫ్ 2 కోసం కూడా ఆడియన్స్ అంతే ఎదురు చూశారు. ప్రముఖ కన్నడ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోం భలే ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమాకి సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకి ఒక సంబంధం ఉందట అదేంటో ఇప్పుడు చూద్దాం.

అసలు కారణం ఇదే..

ఇకపోతే ఈ సినిమా టైటిల్ పేర్లు పడే ముందు కైకాల సత్యనారాయణ సమర్పించు అని వస్తుంది. అయితే ఈ విషయాన్ని చాలామంది గమనించకపోయి ఉండవచ్చు. అయితే ఈ పేరు గమనించిన వారు మాత్రం ఈయన పేరు సినిమా ముందు ఎందుకు వేశారని అనుమానం కూడా వ్యక్తం చేశారు. కైకాల సత్యనారాయణ ఒకప్పుడు రమా ఫిలిమ్స్ అనే బ్యానర్లో సినిమాలను నిర్మించేవారు. ఆయన తర్వాత ఆయన వారసుడు నిర్మాణరంగంలోకి అడుగు పెట్టాడు. కైకాల సత్యనారాయణ కొడుకు కన్నడ ఇండస్ట్రీలో నిర్మాణ రంగంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే కేజిఎఫ్ చాప్టర్ వన్ సినిమాకి ఆయన సహనిర్మాతగా వ్యవహరించారు. ఆ సమయంలో సినిమా హిట్ అవుతుందని అంచనా వేసిన కైకాల తనయుడు తెలుగు రైట్స్ కోసం కూడా పోటీపడ్డారు. అయితే టాలీవుడ్ లో సాయి కొర్రపాటి వంటి పెద్ద నిర్మాతలు అవసరం అవుతారని ఆయనతో చేతులు కలిపి ఈ సినిమాను తెలుగులో విడుదల చేసి ఇక్కడ దాదాపు రూ.18 కోట్లు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా సమయంలోనే కేజిఎఫ్ యూనిట్ కైకాల సత్యనారాయణ కు సన్మానం కూడా చేసింది. అలా ఆయన కొడుకు సహనిర్మాతగా వ్యవహరించారు కాబట్టి కైకాల సత్యనారాయణ సమర్పణలో అని కే జి ఎఫ్ చాప్టర్ వన్ టైటిల్ పేర్ల ముందు ఈయన పేరు రావడం జరిగింది.. ఇకపోతే 2022లో వయోభారతంతో ఆయన స్వర్గస్తులయ్యారు ఇంత గొప్ప లెజెండ్రీ నటులు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరమైన చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు