Kaithi 2: ఖైదీ 2 గురించి క్లారిటీ ఇచ్చిన కార్తీ

Kaithi 2: కార్తీ మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించే సినిమాలు చేశారు. కార్తీకి తెలుగులో మంచి ఆదరణ లభిస్తుంది. కార్తీ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీ కూడా చాలా సందర్భాల్లో నాకు తమిళ్ ఆడియన్స్ కంటే కూడా తెలుగు ఆడియన్స్ చాలా ఇష్టమని చెబుతుంటారు. తెలుగు ఆడియన్స్ ఒక మంచి సినిమాకి ఎంతలా బ్రహ్మరథం పడతారు మనకు తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూడటం తెలుగు ప్రేక్షకులకు అలవాటు అలా ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులు హిట్ చేశారు.

సూర్య తమ్ముడు గా ఎంట్రీ చిన్న కార్తి తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక కార్తీక్ కెరియర్ లో వచ్చిన బెస్ట్ ఫిలిమ్స్ లో ఖైదీ సినిమా ఒకటి. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ కి నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది. కేవలం ఒక నైట్ జర్నీని ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించాడు లోకేష్ కనకరాజ్. ఈ సినిమాతో లోకేష్ క నాగరాజ్ స్టార్ ఫిలిం మేకర్ అయిపోయాడు. లోకేష్ సినిమా అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో పెరిగిపోయాయి అంతలా ఈ సినిమాను డిజైన్ చేసి అద్భుతంగా తెరకెక్కించాడు లోకేష్.

Kaithi

- Advertisement -

నగరం సినిమాతో ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన లోకేష్ ఈ సినిమాతోనే మంచి పేరును సాధించి ఆ తర్వాత స్టార్ హీరోలతో సైతం పనిచేయటం మొదలు పెట్టాడు. లేకపోతే ఖైదీ టు అప్డేట్ ను కార్తి రివీల్ చేశాడు 2025లో ఖైదీ షూటింగ్ మొదలవబోతున్నట్లు చెప్పాడు. ఫ్యాన్స్ తో మాట్లాడిన సందర్భంలో కార్తీ మాట్లాడుతూ నెక్స్ట్ ఇయర్ ఈ సినిమాను లోకేష్ తెరకెక్కించనున్నాడు మళ్ళీ బకెట్ బిర్యానీతో రావడానికి సిద్ధం అవుతున్నాను అంటూ చాలా ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే లోకేష్ ప్రస్తుతం రజనీకాంత్ కూలి అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు