Kajal Agarwal: కాజల్ అగర్వాల్ జీవితాన్నే మార్చేసిన స్టార్ హీరో..!

Kajal Agarwal.. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసినట్టు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన సలహా తన జీవితాన్నే మార్చేసింది అని చెబుతోంది ప్రముఖ బ్యూటీ కాజల్ అగర్వాల్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ప్రముఖ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ అనే సినిమా ద్వారా అడుగు పెట్టి ఆ తర్వాత చందమామ సినిమాతో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఈమె.. ఏకంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరలో నటించి ఓవర్ నైట్ కి స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ , చిరంజీవి , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

ఆ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపు..

Kajal Agarwal: Kajal Agarwal is the star hero who changed life..!
Kajal Agarwal: Kajal Agarwal is the star hero who changed life..!

ఇకపోతే బన్నీ – కాజల్, ఎన్టీఆర్ – కాజల్ కాంబినేషన్లు ఎంతోమంది అభిమానులకు బాగా నచ్చుతాయి.. అందుకే ఈ కాంబినేషన్లు మళ్లీ రిపీట్ అవ్వాలని కూడా కోరుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా బన్నీ తనకు ఇచ్చిన సలహా తన జీవితాన్ని మార్చేసిందని కాజల్ అగర్వాల్ వెల్లడించగా.. ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అల్లు అర్జున్ తనకు విలువైన సలహాలు ఇచ్చారని ఆ సలహాను ఆమె ఇప్పటికీ పాటిస్తున్నారని తెలిపింది..

బన్నీ ఇచ్చిన సలహా ఏమిటంటే..

ఇంతకూ బన్నీ ఇచ్చిన సలహా ఏమిటంటే..కెమెరా ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంత సమయం పాటు అదే ఎమోషన్ లో ఉండాలని బన్నీ సూచించారని… ముఖ్యంగా ఎడిటింగ్ సమయంలో అది ఉపయోగపడుతుందని.. బన్నీ చెప్పినట్లు ఆమె తెలిపింది. బన్నీ ఇచ్చిన ఈ సలహా తన కెరీర్ కు చాలా ప్లస్ అయింది అని కూడా ఆమె చెప్పుకొచ్చింది.. ఇకపోతే ఆర్య 2, ఎవడు వంటి సినిమాలలో బన్నీ – కాజల్ అగర్వాల్ కలిసి నటించగా ..ఈ సినిమాలలో ఆర్య 2 యావరేజ్ గా నిలిస్తే.. ఎవడు సినిమా బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుంది. మొత్తానికి అయితే బన్నీ తనకు ఇచ్చిన సలహా తన కెరీర్ నే మార్చేసింది అంటూ స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

సత్యభామతో కాజల్..

ఇకపోతే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సుమన్ చిక్కాల డైరెక్షన్లో సత్యభామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు మే 17వ తేదీన రానుంది . ఇందులో నవీన్ చంద్ర , ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పణలో బాబీ తిక్క , శ్రీనివాసరావు తక్కలపల్లి ఈ సినిమాను నిర్మించారు.. క్రైమ్ థ్రిల్లర్ మూవీ గా వస్తున్న ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే .. మరి రేపు రాబోయే ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుంది అన్నది చూడాలి. మొత్తానికైతే కాజల్ అగర్వాల్ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అందరిలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి .ఇక మరొకవైపు కమలహాసన్ తో ఇండియన్ 2 సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు