Kajal Agarwal: ఏంటీ.. గౌతమ్ ఫేవరెట్ హీరోయిన్ కాజల్ కాదా.. మరెవరు?

Kajal Agarwal.. కాజల్ అగర్వాల్ అని చెప్పడం కంటే తెలుగు అభిమానుల చందమామ అని చెప్పడంలో సందేహం లేదు.. చందమామగా ఈమెకు టాలీవుడ్ లో మరింత పేరు ఉంది.. సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికే అదే అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు పరిశ్రమ నాకు మెట్టినిల్లు అంటూ చెప్పుకొచ్చింది. దాదాపు తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

సత్యభామ గా ప్రేక్షకుల ముందుకు..

వివాహమనంతరం ఒక కొడుకుకు కూడా జన్మనిచ్చింది. మధ్యలో కరోనా కూడా రావడంతో దాదాపు రెండు, మూడు సంవత్సరాలు సినీ పరిశ్రమకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత భగవంత్ కేసరి సినిమాలో నటించగా..ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మరొకవైపు కోలీవుడ్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తోంది అంటూ వార్తలు వచ్చాయి.. కానీ ఇటీవల ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్లో ఇండియన్ 3లో ఈమె నటించిన సన్నివేశాలు ఉంటాయి అంటూ డైరెక్టర్ అభిమానులను నిరాశపరిచారు. అయితే ఇదిలా ఉండగా తాజాగా ఈమె లేడీ ఓరియంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సత్యభామ అనే సినిమాతో జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఇందులో రియల్ గా యాక్షన్ స్టంట్స్ చేసి అందరిని ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా మిశ్రమ టాక్ తెచ్చుకోవడం గమనార్హం.

కాజల్ భర్త ఫేవరెట్ హీరోయిన్ ఆమే..

Kajal Agarwal: what.. Gautham's favorite heroine isn't Kajal.. who else?
Kajal Agarwal: what.. Gautham’s favorite heroine isn’t Kajal.. who else?

తాజాగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ.. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విషయాలను కూడా పంచుకుంది. అందులో భాగంగానే మీ వివాహానికి ముందు.. మీ భర్త గౌతమ్ కిచ్ లు మీరు చేస్తున్న పనికి అభిమాని కాదా అని అడగగా.. దానికి కాజల్ ఫన్నీ టోన్లో తన భర్త గౌతం తనకు అభిమాని కాదు అని.. తాను సమంత హార్డ్ కోర్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. అదేంటి కాజల్ అంటే పడి చచ్చిపోయే అభిమానులు యావత్ దేశవ్యాప్తంగా ఉన్నారు.. అలాంటి ఆమెను కాదని సమంత తన ఫేవరెట్ హీరో అని ఎలా చెప్తాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఇంట్లో పూరి కాదని..బయట దొరికే చపాతి నచ్చుతుందా అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం .. మొత్తానికైతే సమంత తన భర్త ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది చందమామ..

- Advertisement -

టేస్టీ తేజ తో కూడా సందడి..

ఇదిలా ఉండగా ఇటీవల ప్రముఖ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ టేస్టీ తేజ తో కూడా ఫుడ్ వ్లాగ్ చేసింది కాజల్ అగర్వాల్.. ఇటీవల కడలి రెస్టారెంట్లో కలుసుకున్న వీళ్లిద్దరు సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే వీడియో షేర్ చేయడం జరిగింది. తాను పూర్తిగా వెజిటేరియన్ అని.. ఇలా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ టెస్ట్ చేయడం తనకు చాలా ఇష్టమని తేజ తో మరొకసారి వీడియో చేసి ఇలా ఫుడ్డు మొత్తం టేస్ట్ చూడాలని ఉంది అంటూ తన మనసులో మాట బయట పెట్టింది కాజల్ అగర్వాల్.. మొత్తానికైతే టేస్టీ తేజ కూడా ఈ రకంగా మరింత పేరు సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు