Kajal Aggarwal : మ‌రోసారి

టాలీవుడ్‌ అగ్రహీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలోని డైలాగ్స్, డ్యాన్స్, పాటలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అల్లు అర్జున్ కు బిగ్ హిట్ అందించింది. కాగా దీనికి కొనసాగింపుగా పుష్ప-2 ను సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పుష్ప-2 కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప-2 మరింత క్రేజ్ తీసుకురావడానికి చిత్ర యూనిట్ చూస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాలో స్టార్ నటి నటులను ఎంపిక చేసుకోవడానికి సిద్ధమయ్యారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు సుకుమార్ టీమ్. మొదటి పార్ట్ లో విలన్ గా అదరగొట్టిన ఫహాద్ ఫాజిల్ సెకండ్ పార్ట్ లో మరింత వైల్డ్ గా కనిపించనున్నారట.

బన్నీ-ఫహద్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉంటాయని అంటున్నారు. అయితే పార్ట్- 2 లో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని అంటున్నారు. ఈ స్పెషల్ సాంగ్ లో చందమామ కాజల్ అగర్వాల్ కనిపించనుందట. వివాహం తర్వాత కాజల్ సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. బిడ్డ పుట్టిన తర్వాత మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న ఇటీవలే ఇండియ‌న్ 2 సినిమా కోసం కాజల్ గుర్ర‌పు స్వారి చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్ లో మెరిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప 2 లో మ‌రోసారి స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌డానికి కసరత్తులు చేస్తోంది ఈ బ్యూటీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు