Kajal Agarwal : నెట్టింట సత్యభామ హడావిడి.. వసూళ్లు మాత్రం నిల్..

Kajal Agarwal : కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ జోష్ లో ఉంది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ భామ రీ ఎంట్రీ తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. లాస్ట్ ఇయర్ లో భగవంత్ కేసరి తో సూపర్ హిట్ అందుకున్న కాజల్ అగర్వాల్ తాజాగా “సత్యభామ” అంటూ లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాజల్ మెయిన్ లీడ్ లో పవర్ ఫుల్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన చిత్రం కావడం విశేషం. ఇక సత్యభామ సినిమా ఫస్ట్ లుక్ తోనే కాజల్ ఇంప్రెస్స్ చేయగా, టీజర్, ట్రైలర్ ద్వారా అంచనాలు పెంచేసింది. ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కాజల్ (Kajal Agarwal) సత్యభామ ఐపీఎస్ పాత్రలో నటించింది. ఇక జూన్ 7న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక స్క్రీన్ ప్లే శశి కిరణ్ టిక్కా అందించడం వల్ల సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో విడుదల కాగా ఓ మోస్తరు రెస్పాన్స్ తెచ్చుకుంది.

Kajal Aggarwal Promotions for Satyabhama movie on social media

నెట్టింట ప్రమోషన్స్ తో బిజీ..

ఇక టాలీవుడ్ ‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ నటించిన ఈ సత్యభామ లో నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషించాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా ని సుమన్ చిక్కాల డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, రవి వర్మ, నాగినీడు, హర్ష వర్ధన్, నేహా పఠాన్, సంపద కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. ఇక ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకున్నా ముందునుండే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా లో ప్రమోషన్లతో బిజీ అయింది. బాలకృష్ణ వంటి బడా హీరోలతో ప్రమోషన్ చేయించుకున్న కాజల్, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ హడావిడి చేస్తుంది. ఇక సినిమాకి అంతగా టాక్ రాకపోయినా, తన వంతు ప్రమోషన్లు చేస్తూ జనాల్ని థియేటర్లకు రప్పించడానికి ట్రై చేస్తుంది కాజల్. అలాగే పలు ఇంటర్వ్యూలలో కూడా సందడి చేస్తూ, సినిమా గురించి ఆడియన్స్ పెడుతున్న రివ్యూ లను పోస్ట్ చేస్తూ రీట్వీట్ చేస్తూ సందడి చేస్తుంది.

- Advertisement -

కలెక్షన్లు నిల్..

అయితే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సత్యభామ థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకోగా మొదటి రోజున 20 లక్షల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోగా, రెండో రోజు సినిమా కొంచం గ్రోత్ ని చూపించి 24 లక్షల రేంజ్ దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సినిమా సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా రెండు రోజుల కలెక్షన్స్ 50 లక్షల రేంజ్ దాకా ఉంటుందని అంచనా. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అయిందని అనిపించుకోవాలి అంటే 2 కోట్ల రేంజ్ లో అయినా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అయితే కాజల్ సినిమాకి ఇంత తక్కువ కలెక్షన్లు వస్తాయని అనుకోలేదు. పైగా పోటీలో ఇతర సినిమాలు ఉండడం ఒక కారణం అని చెప్పొచ్చు. అయినా కాజల్ అగర్వాల్ తనవంతు ప్రమోషన్లు చేస్తూ థియేటర్లకు జనాలని రప్పించడానికి ప్రయత్నిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు