Kajal Agarwal: అతడంటే పిచ్చి.. పెళ్ళి తర్వాత అతడిపై ఇష్టం పెంచుకుందా..?

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలో వివాహం చేసుకోవడంతో ఒకసారిగా ఈమె క్రేజ్ కు బ్రేక్ పడింది.. ఆ తర్వాత ఒక బాబుకు కూడా జన్మనివ్వడంతో హీరోయిన్గా అవకాశాలు రాలేదు.. దీంతో సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తోంది.. తాజాగా కాజల్ అగర్వాల్ తన ఫేవరెట్ హీరో గురించి తెలియజేస్తూ టాలీవుడ్ లో తనకు ఎంతగానో నచ్చిన ఒక నటుడు తనే అంటూ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తెలియజేసింది. వాటి గురించి చూద్దాం.

నా ఫేవరెట్ హీరో అతడే..
కాజల్ అగర్వాల్ తన ఫేవరెట్ హీరో తెలియజేస్తూ.. తనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని తెలియజేసింది.. ఆయనతో నటించడం మరింత ఇష్టం అని కూడా తెలియజేసింది. అలాగే తమిళంలో విజయ్ దళపతి తన ఫేవరెట్ హీరో అని డైరెక్ట్ గానే చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే కాజల్ చెప్పిన ఈ సమాధానం విని పలువురు స్టార్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైనా కాజల్ అగర్వాల్ ఎలాంటి విషయాన్ని అయినా సరే ముక్కు సూటుగానే సమాధానం చెప్పేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన తెలుగు , తమిళ్ హీరోల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ..

కాజల్ అగర్వాల్ కెరియర్.
దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.. కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అటు టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో నటించింది. మొదటిసారి లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే పరవాలేదనిపించుకుంది.. ఆ తర్వాత ఏకంగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాలో అవకాశం దక్కించుకొని ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ హోదాను సొంతం చేసుకుంది.. ఇక తర్వాత మిస్టర్ ఫర్ఫెక్ట్ ,టెంపర్, డార్లింగ్ బిజినెస్ మాన్ వంటి తదితర చిత్రాలలో నటించి లక్కీ హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది.. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

కాజల్ అగర్వాల్ చిత్రాలు..
ఇటీవల కాలంలో ఈమె నటించిన భగవంత్ కేసరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. ఇందులో బాలయ్యకు జోడిగా నటించిన కాజల్ అగర్వాల్ అద్భుతంగా నటించింది.. ప్రస్తుతం ఈమె చేతిలో భారతీయుడు-2 సినిమా తో పాటూ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కాజల్ అగర్వాల్ కాస్త బరువు పెరగడంతో..ఆ బరువు తగ్గడానికి పలు రకాల కసరత్తులు ,వ్యాయామాలు, జిమ్ వర్కౌట్లు వంటివి చేస్తోంది. ఏది ఏమైనా పూర్వ వైభవాన్ని తిరిగి పొందడానికి తెగ కష్టపడుతోంది ఈ ముద్దుగుమ్మ.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు