Kajal Aggarwal : క‌ష్ట‌మైనా..

టాలీవుడ్ బ్యూటీ కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌గ‌ధీర సినిమాతో ఎంత ఫేమ‌స్ అయిందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇక అప్పటి నుంచి వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్లింది. ఇటీవ‌ల బాబు పుట్ట‌డంతో కాస్త గ్యాప్ ఇచ్చింది. బాబు పుట్టిన త‌రువాత నాలుగు నెల‌ల త‌రువాత తిరిగి మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధ‌మైంది. ఈ త‌రుణంలో త‌న ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తోంది.

తాజాగా తాను గుర్ర‌పు స్వారి చేస్తున్న వీడియోల‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. డెలివ‌రీ త‌రువాత శ‌రీరంలో జ‌రిగిన మార్పులు తిరిగి తాను షూటింగ్స్ కోసం ఎలా సిద్ధ‌మైంద‌నే విష‌యాల‌ను ఆమె వివ‌రించింది. పాన్ ఇండియా ద‌ర్శ‌కుడు శంక‌ర్‌- క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్ లో రాబోతున్న ఇండియ‌న్ 2 సినిమాలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా షూటింగ్ రెండేళ్ల పాటు నిలిచిపోయింది.

ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనేందుకు గుర్రంస్వారీ చేస్తూ శిక్ష‌ణ తీసుకుంటున్నాన‌ని.. గ‌తంలో ఉన్న‌ట్టు ప్ర‌స్తుతం త‌న శ‌రీరం లేద‌ని, డెలివ‌రి త‌రువాత బాడీలో మార్పులు రావ‌డం స‌హ‌జం అని చెప్పుకొచ్చింది. “ప్ర‌స‌వం జ‌రిగిన నాలుగు నెల‌ల త‌రువాత నేను తిరిగి షూటింగ్‌లో జాయిన్ అవుతున్నాను. చాలా రోజుల త‌రువాత జిమ్‌కు వెళ్లాను. నా శ‌రీరానికి ఎన‌ర్జీ లెవ‌ల్స్ పొంద‌డం చాలా క‌ష్టంగా ఉంది. గుర్ర‌పు స్వారి చేయ‌డం కూడా పెద్ద ప‌నిలా అనిపించింది. గ‌తంలో చాలా సుల‌భంగా చేశాను. మ‌న శ‌రీరం మార‌వ‌చ్చు. కానీ మ‌న ఆత్మ‌విశ్వాసం, అభిరుచి ముందు ఏది క‌ష్టం కాదు. మ‌నం ఎప్పుడూ ముందు చూపుతోఉండాలి. మ‌న‌కు కావాల్సిన దానిపై దృష్టి సారించాలి. మ‌నం ఎంచుకున్న వాటిపై అప‌రాధ భావంతో ఉండ‌కూడ‌దు అంటూ చెప్పుకొచ్చింది కాజ‌ల్‌. ఇండియ‌న్ 2 మూవీతో మ‌రోసారి మీ ముందుకు రావ‌డం చాలా సంతోషంగా ఉంది” అని వెల్లడించింది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు