Kalki 2: కల్కి 2 సినిమాలో వాళ్లను కూడా ఇన్వాల్వ్ చేస్తాను, సోషల్ మీడియా బానే వర్కౌట్ అవుతుంది

Kalki 2: చాలామంది డైరెక్టర్లు ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ డైరెక్టర్ కంటే కూడా ప్రేక్షకులు చాలా తెలివైన వారు అంటూ ఉంటారు. ఇకపోతే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాని అనాలసిస్ చేస్తూ ఆ సినిమాని అర్థం చేసుకొని ఆనందాన్ని పొందే ప్రేక్షకులు ఈరోజుల్లో చాలామంది ఉన్నారు అని చెప్పొచ్చు. కొన్ని కథలు మధ్యలో ఆగిపోయినప్పుడు తర్వాత ఏం జరగబోతుంది అని గెస్ చేసి ఆడియన్స్ కూడా ఉన్నారు. లేకపోతే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కల్కి సినిమా గురించి ప్రస్తావన వినిపిస్తుంది. కల్కి సినీమాటిక్ యూనివర్స్ ను నాగి క్రియేట్ చేయనున్నాడు.

ఇకపోతే రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసి విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 700 కోట్లకు పైగా వసూలు చేసింది. కమల్ హాసన్, అమితాబచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ తో పాటు చాలామంది సినిమా ప్రముఖులు ఈ సినిమాలో కనిపించారు. అయితే ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో అమితాబచ్చన్ ని అశ్వద్ధామ పాత్రలో చూపించి ప్రేక్షకునికి గూస్బంస్ వచ్చేలా కొన్ని సీన్స్ ను డిజైన్ చేశాడు. అలానే ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్ మరియు అమితాబచ్చన్ ని చూపించి మంచి విజువల్ ట్రీట్ ఇచ్చాడు.

Kalki 2898 AD

- Advertisement -

ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడు పాత్రలో కనిపిస్తున్నాడు. అలానే సుప్రీం యస్కిన్ పాత్రలో కమల్ హాసన్ కనిపించారు. అయితే ఈ సినిమాలో భైరవ క్యారెక్టర్ చేసిన ప్రభాస్ కాంప్లెక్స్ కి ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటారు. అసలు భైరవ కాంప్లెక్స్ కి ఎందుకు వెళ్లాలి అనుకుంటున్నాడు, తర్వాత జరగబోయే కథ ఏంటి అని కొంతమంది సోషల్ మీడియా వేదిక రాసుకుంటూ వస్తున్నారు. వీటిని కూడా నాగ్ అశ్విన్ గమనిస్తున్నాడు. ఎవరైనా సినిమాకి రిలేటెడ్ గా రాసి నిజమైన అనాలసిస్ చేస్తే వారిని కూడా ఈ కల్కి ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేయబోతున్నట్లు తెలిపాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు