Kalki 2898 AD : కల్కిలో అశ్వత్థామతో పాటు ఉన్న ఈ చిన్న పాప ఎవరో తెలుసా.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

Kalki 2898AD.. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898 AD.. ఎన్నో వాయిదాల తర్వాత భారీ అంచనాల మధ్య జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.. సైన్స్ ఫిక్షన్ కు మైథాలజికల్ టచ్ ఇచ్చి ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లిపోయారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇందులో దీపికా పదుకొనే , విజయ్ దేవరకొండ , అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, మృనాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ ,దిశా పటాని, మాళవిక నాయర్ , శోభన తదితరులు కీలక పాత్రలు పోషించారు ప్రతి పాత్ర కూడా చాలా అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.

Kalki 2898 AD : Do you know who this little baby is with Ashwatthama in Kalki.. What is her background..?
Kalki 2898 AD : Do you know who this little baby is with Ashwatthama in Kalki.. What is her background..?

రాయ పాత్రలో అద్భుతంగా నటించిన కేయా నాయర్..

ఇందులో అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ నటించగా.. కర్ణుడిగా ప్రభాస్ నటించారు. ఇకపోతే ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ లో నటించిన వాళ్లు కూడా స్టార్స్ గా మారిపోయారు. అందులో ఒకరు కల్కిలో రాయ అనే క్యారెక్టర్ నటించిన అమ్మాయి. కాంప్లెక్స్ బౌంటీ నుంచీ తప్పించుకొని అశ్వద్ధామ ఉన్న గుహకు వెళ్లి అశ్వద్ధామ శక్తులను తిరిగి రప్పించే ప్రయత్నంలో భాగంగా ఆయనకు మణి ని అందిస్తుంది.. అయితే అక్కడ కుర్రాడి పాత్రలో కనిపించినా..అదే సినిమాలో ఆమె అమ్మాయి.. యాస్కిన్ నుంచి తప్పించుకోవడానికి అబ్బాయి గెటప్ లో తిరుగుతూ ఉంటుంది అలా కాంప్లెక్స్ బౌంటీ నుంచి తప్పించుకొని అశ్వద్ధామ వద్దకు చేరి అతడి శక్తులను గుర్తు చేసే పాత్రలో చివరి వరకు కనిపిస్తుంది అయితే రాయ గా నటించింది ఎవరు ? అని అభిమానులు సైతం తెలుసుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు.

కేయా నాయర్ గొప్ప డ్రాయింగ్ ఆర్టిస్ట్..

ఇక ఆమె పేరు కేయా నాయర్.. ఈమె ఒక గొప్ప డ్రాయింగ్ ఆర్టిస్ట్. అంతకుముందు ఏ సినిమాలో కూడా నటించలేదని తెలుస్తోంది. కల్కి రిలీజ్ అయిన దగ్గర్నుంచి ఈమెకు మంచి పేరు కూడా లభించింది అంతేకాదు ఇటీవల నాగ్ అశ్విన్ బర్తడే వేడుకలలో కూడా సందడి చేసి డాన్సులతో అదరగొట్టేసింది.. పైగా ఈ సినిమాలో అవకాశం కల్పించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు.. నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ లకు కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ధన్యవాదాలు తెలిపింది. పైగా ఈమెకు 2 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.. సోషల్ మీడియాలో కూడా పెద్దగా ఫాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నట్లు కనిపించడం లేదు.

- Advertisement -

అబ్బాయి గానే కాదు అమ్మాయిగా మరింత అందంగా..

ఇదిలా ఉండగా తనకు సంబంధించిన ఫోటోలను మాత్రమే షేర్ చేసుకునే కేయా నాయర్ ఇటీవల ఒక పోస్ట్ చేసింది… సినిమాలోని అబ్బాయి క్యారెక్టర్ లో ఉన్న రాయ ఫోటోని ముందు పెట్టి.. వెనుకల తాను అమ్మాయిగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ అబ్బాయిగా అందంగా ఉన్న అమ్మాయిగా ఇంకా అందంగా ఉంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు ఒక్క సినిమాతోనే భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఏ మేరకు సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు