Kalki 2898 AD : కల్కిలో దుల్కర్ క్రేజీ రోల్… ప్రభాస్ కే బాబు లాంటి పాత్ర

Kalki 2898 AD : ప్రభాస్ మేనియాతో ప్రస్తుతం దేశమంతా ఊగిపోతోంది. ఆయన హీరోగా నటించిన కల్కి 2898 ఏడి మూవీ ప్రపంచవ్యాప్తంగా గురువారం రోజు అంటే జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే మాత్రమే కాదు పలువురు సౌత్ స్టార్ హీరోలు కూడా కీలకపాత్రలను పోషించారు. అయితే ఇప్పటిదాకా సీక్రెట్ గా ఉంచిన ఆ పాత్రలన్ని తాజాగా మూవీ థియేటర్లలోకి రావడంతో సోషల్ మీడియా వేదికగా లీక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ సూపర్ స్టార్స్ లో ఒకరైన దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో పోషించిన పాత్ర గురించి సమాచారం బయటకు వచ్చింది.

దుల్కర్ సల్మాన్ క్రేజీ రోల్…

ఈ సినిమాలో ప్రభాస్ భైరవ అనే బౌంటీ హంటర్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ  సినిమా మహాభారతం ఆధారంగా భవిష్యత్తు కథాంశంతో ఓ బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కింది. ఇక పలు ముఖ్యమైన పాత్రల్లో డైరెక్టర్ నాగ అశ్విన్ సౌత్ ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ ను నటింపజేశారు. అయితే సినిమాలోని ప్రధాన పాత్రధారులు తప్ప మిగతా వాళ్లంతా ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారు అనే విషయంపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. కనీసం నాగ్ అశ్విన్ మూవీ రిలీజ్ కి ముందు కూడా ఆ విషయాలపై అప్డేట్స్ ఇవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ఒక క్రేజీ పాత్రలో నటించారని తెలుస్తోంది.THESE actors play a special cameo in Prabhas-Nag Ashwin's 'Kalki 2898 AD' | - Times of India

ప్రభాస్ కే బాబు లాంటి పాత్ర

ప్రభాస్ ఈ సినిమాలో మెయిన్ హీరో అన్న విషయం తెలిసిందే. కానీ ఇందులో దుల్కర్ సల్మాన్ రోల్ ప్రభాస్ కు బాబు లాగా ఉందని అంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమాలోని పలువురు ప్రధాన పాత్రధారుల పాత్రలు లీక్ కాగా, ఇందులో దుల్కర్ సల్మాన్ ప్రభాస్ ను పెంచే వ్యక్తిగా నటించాడని సమాచారం. చిన్నప్పటి నుంచి బైరవను పెంచి, పెద్ద చేసి అన్ని నేర్పిస్తాడు దుల్కర్ సల్మాన్. కానీ కాంప్లెక్స్ లోకి వెళ్లాలనే ఉద్దేశంతో వేరే వాళ్ళకి భైరవను అమ్మేస్తాడు. అయితే అదే భైరవ పెద్దయ్యాక బౌంటీ హంటర్ కదా.. చివరకు తనను పెంచిన దుల్కర్ సల్మాన్ ను డబ్బు కోసం పట్టిస్తాడు. ఇక ఈ సినిమాలో దుల్కర్ జస్ట్ కెప్టెన్ అనే పాత్రలో నటించినట్టుగా సమాచారం. మొత్తానికి ఈ సినిమాలో దుల్కర్ కు ఓ అద్భుతమైన పాత్ర దక్కిందని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు థియేటర్లలో ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. బాహుబలి తర్వాత ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించే మూవీ కల్కి రూపంలో ఇన్నాళ్లకు పడిందని ప్రభాస్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ బాహుబలి, ట్రిపుల్ ఆర్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్టుగా టాక్ నడుస్తోంది. ఇప్పటికైతే ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే అన్నట్టుగా ఉంది పరిస్థితి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు