Kalki 2898 AD : హిందీలో హిస్టారికల్ మైల్ స్టోన్ క్రియేట్… ఇది ఆల్ టైం రికార్డ్ గురు

Kalki 2898 AD : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సినిమా కల్కి. దర్శకుడు నాగ అశ్విన్ మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ జోనర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. సైన్స్ ఫిక్షన్ కి మైథాలజికల్ స్టోరీని కలపడం అనేది మామూలు విషయం కాదు. అసలు ఆ ఆలోచనతోనే దర్శకుడు సగం సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. ఈ ఆలోచనను వెండితెర మీద ఆవిష్కరించడం అనేది అసాధారమైన పని. అయితే దానిని చాలామంది టెక్నీషియన్ సహాయంతో వెండితెరపై ఆవిష్కరించారు. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి అందరినీ ఆశ్చర్యపరిచి వావ్ అనిపించేలా రిజల్ట్ సాధించింది.

ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ క్రియేట్ చేసుకుంటూ రావాలి అసలు ఇది ఎలా వస్తుందో కూడా తెలియదు అంటూ పలు ఇంటర్వ్యూస్ చెప్పుకొచ్చారు. ఇక దర్శకుడు తో పాటు చిత్ర యూనిట్ కూడా చెప్పినట్లు ఈ సినిమాకి సంబంధించి ప్రతి వస్తువుని వెహికల్ ని తయారు చేస్తూ వచ్చారు. అలానే ప్రభాస్ కోసం బుజ్జి అనే ఒక వెహికల్ ని కూడా తయారు చేశారు. దీనికోసం దర్శకుడు నాగి మహేంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహేంద్రా తో చర్చలు జరిపి ఆటోమొబైల్ ఇంజనీర్స్ తో కలిసి వెహికల్ వెళ్ళిన తయారు చేశారు. ఒక సినిమాలు ఈ వెహికల్ కి ఎంత కీలకపాత్ర ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Kalki 2898 AD : Historical Milestone Created in Hindi... It's All Time Record

- Advertisement -

ఇకపోతే ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే దాదాపు 500 కోట్లకు పైగా వచ్చాయి. మునుపెన్నడు లేని విధంగా హిందీలో ఈ సినిమా ఈరోజుకి 115 కోట్లు ఫస్ట్ వీకెండ్ లో సాధించుకుంది. అయితే బాలీవుడ్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ రావటం అంటే మామూలు విషయం కాదు. ఇకపోతే ఈ సినిమాలో అమితాబచ్చన్ అశ్వద్ధామ పాత్రలో కనిపించారు. అశ్వద్ధామ కి ఈ సినిమాలో ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా చూసి బయటికి వచ్చిన చాలామంది అమితాబచ్చన్ ని హీరో అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఒక తెలుగు సినిమా ఈ స్థాయి ఘనవిజయాన్ని సాధించడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక అరుదైన విషయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు