Kalki 2898 AD : ప్రభాస్ అంటే వణికిపోతున్న బాలీవుడ్ స్టార్స్… ఎంత ఇబ్బంది పెట్టినా కల్కిని ఆపలేరు

Kalki 2898 AD : తెలుగు సినిమా స్పాన్ పెరిగినప్పటి నుంచి బాలీవుడ్ డీలా పడిన విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడల్లా బాలీవుడ్ స్టార్స్ లో ఉన్న ఇన్ సెక్యూరిటీ బయట పడుతూనే ఉంది. ముఖ్యంగా ప్రభాస్ పేరు వినగానే కొంతమంది హిందీ హీరోలకు ఎక్కడలేని వణుకు పుట్టుకొస్తుంది. అందుకే ఆయన సినిమాలకు కావాలని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా కల్కి విషయంలో కూడా అదే జరిగింది.

కల్కికి కావాలనే ఇబ్బందులు ?

ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి మూవీ గురించే టాక్ నడుస్తోంది. కానీ ఇది కొంతమంది బాలీవుడ్ హీరోలకు నచ్చుతున్నట్టుగా అనిపించడం లేదు. భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అని చెప్పుకునే స్థాయి నుంచి టాలీవుడ్ అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి. దీన్ని వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ప్రభాస్ నటించిన కల్కి విషయంలో ఆయన గత చిత్రం సలార్ సీన్ రిపీట్ కావడమే అందుకు నిదర్శనం. కల్కి 2898 ఏడి మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే. కానీ ఈ మూవీకి సంబంధించిన హిందీ టికెట్ బుకింగ్స్ ఇంకా పూర్తిస్థాయిలో స్టార్ట్ కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరో చెప్తే ఈ వార్తలు కేవలం పుకార్లుగానే మిగిలేవి. కానీ బాలీవుడ్ బెల్ట్ లోని సీనియర్ ఎగ్జిబిటర్లలో ఒకరైన మనోజ్ దేశాయ్ ఈ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. కల్కిని పెద్ద స్థాయిలో విడుదల చేయడానికి బాలీవుడ్ లోని కొంతమంది ప్రముఖులు ఒప్పుకోవడం లేదని మనోజ్ వెల్లడించారు. ముంబైలోని కొన్ని మల్టీప్లెక్స్ లో, ప్రసిద్ధ మరాఠా మందిర్ లో కూడా సినిమా విడుదలకు కొన్ని గంటలు మాత్రమే ఉన్నప్పటికీ ఇంకా బుకింగ్స్ ఓపెన్ చేయలేదని ఆయన బహిరంగంగానే కామెంట్స్ చేశారు.

Kalki 2898 AD Release: Too Many Challenges Ahead

- Advertisement -

సలార్ విషయంలో కూడా ఇలాగే

సలార్ విషయంలో కూడా ఇదే జరిగింది. మూవీ రిలీజ్ టైంలో డంకీ కూడా రంగంలోకి దిగడంతో సలార్ మూవీకి థియేటర్లను ఇవ్వడానికి అక్కడి థియేటర్ల యాజమాన్యం చివరి నిమిషం దాకా ఇబ్బంది పెట్టింది. అయితే ఎట్టకేలకు కొన్ని థియేటర్లను మాత్రం ఇచ్చారు. ఇక ఇప్పుడు కల్కి విషయంలో కూడా ఇలాంటి అడ్డంకులే క్రియేట్ చేస్తుండడంతో మరోసారి బాలీవుడ్ అభద్రతాభావం తెరపైకి వచ్చింది.

బాలీవుడ్ లో ఇన్ సెక్యూరిటీ…

మొత్తానికి ప్రభాస్ పేరు వింటేనే సదరు హిందీ బడా హీరోలకు తడిచిపోయేలా చేస్తున్నారు మన మేకర్స్. కావాలనే ప్రభాస్ సినిమాలను హిందీ బెల్ట్ లో భారీ ఎత్తున చేరనివ్వడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభాస్ కటౌట్ కి ఉన్న పవర్ అలాంటిది, అయితే ఎవరిని అడ్డంకులు క్రియేట్ చేసిన కల్కిని ఎవ్వడూ ఆపలేడు అంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి షారుక్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి బడా బాలీవుడ్ స్టార్స్ హిట్ కోసమే కష్టపడుతుంటే ప్రభాస్ మాత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు బాహుబలి కావడంతో హిందీ బడా హీరోలు ఇక తడిగుడ్డ వేసుకొని పడుకోవడం బెటర్ అంటున్నారు డార్లింగ్ ఫాన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు