Kalki 2898 AD : కల్కి 2 షూటింగ్ సగం పూర్తి… రిలీజ్ డేట్ ఎప్పుడంటే…?

Kalki 2898 AD : గత నాలుగు సంవత్సరాలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న కల్కి సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కల్కి యూనివర్స్ లో ఎన్ని సినిమాలు రాబోతున్నాయి అనే చర్చ నడుస్తోంది, ముందైతే అందరి  దృష్టి కల్కి 2పైనే ఉంది. అయితే ఇప్పటికే ఈ షూటింగ్ స్టార్ట్ అయ్యిందని సమాచారం. మరి ఈ మూవీ షూటింగ్ ఎక్కడిదాకా వచ్చింది? ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం.

కల్కి 2 షూటింగ్ ఎంతదాకా వచ్చిందంటే?

సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. దాదాపు మొదటి రోజే 190 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజు దాదాపుగా 300 కోట్లకు చేరువలో ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి 198 కోట్ల వరకు వచ్చాయని అఫీషియల్ గా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ నటించింది. వీరితో పాటు రాంగోపాల్ వర్మ, రాజమౌళి, అనుదీప్ కేవీ వంటి దర్శకులు కూడా ఈ సినిమాలో కనిపించారు. మైథిలాజికల్ సైన్స్ ఫిక్షన్ జానర్ లో వచ్చిన మొదటి సినిమా ఇది. వైఫ్ మైథాలజీని ఇంకోవైపు సైన్స్ ఫిక్స్ అన్ని అద్భుతంగా డీల్ చేశాడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఈ సినిమాకి ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు చాలామంది సెలబ్రిటీలు. ఇప్పటికే రాజమౌళి, రజనీకాంత్, నాగార్జున వంటి ప్రముఖులతో పాటు చాలామంది ఈ సినిమా మీద తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ సినిమా గురించి ఇంకా హైప్ పెంచుతూ వెళ్తున్నారు. ఒకవైపు ప్రశంసలతో పాటు మరోవైపు కలెక్షన్స్ తో కూడా దూసుకుపోతుంది ఈ సినిమా.

Prabhas Starrer 'Kalki 2898 AD' earns crores of rupees in pre-release  business : Reports

- Advertisement -

ఈ సినిమా సక్సెస్ఫుల్ గా కొనసాగడంతో కల్కికి సంబంధించి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు నిర్మాత అశ్విని దత్. ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన విషయాలను పంచుకోవడంతో పాటు కల్కి పార్ట్ 2 గురించి కూడా ఒక విషయాన్ని రివీల్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి కల్కి 2 దాదాపు 60 శాతం వరకు పూర్తయిపోయినట్లు చెప్పారు. కొన్ని మేజర్ సీన్స్ మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని, అవి కూడా త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్లు అశ్విని దత్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా నాగ్ అశ్విన్ చేసిన ఈ ప్లాన్ కి చాలామంది ఫిదా అవుతున్నారు.

కల్కి 2 రిలీజ్ ఎప్పుడు?

కల్కి మూవీ షూటింగ్ అయితే చాలా వరకు కంప్లీట్ అయ్యింది. కానీ రిలీజ్ డేట్ విషయమై ఇంకా క్లారిటీ లేదు. కల్కి మూవీ కోసమే దాదాపు నాలుగేళ్ళు కేటాయించారు నాగ్. షూటింగ్ తో పాటు మంచి విజువల్స్ క్రియేట్ చేయడం కోసం ఎక్కువ టైమ్ తీసుకునరు. అందులో చాలా భాగం సమయం వీఎఫ్ వర్క్ కే కేటాయించారు. ఇప్పుడు పార్ట్ 2 లో కూడా అదే మ్యాజిక్ ని క్రియేట్  చేయాలంటే చాలా టైమ్ పడుతుంది. మరి కల్కి 2 ని నాగీ ఎప్పుడు తెరపైకి తీసుకొస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు