Top Dialogue in Kalki 2898 AD : ‘కల్కి 2898 AD ‘ మూవీలోని అలరించే డైలాగులు ఇవే

Top Dialogue in Kalki 2898 AD : ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన రూ.600 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం ‘కల్కి 2898 ad’. అశ్వినీదత్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 27న రిలీజ్ అయ్యి.. ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. భైరవగా ప్రభాస్, అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్..ల పెర్ఫార్మన్స్..లకి కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. అంతేకాదు ‘కల్కి..’ లో అద్భుతమైన సంభాషణలు కూడా ఉన్నాయి. బుర్ర సాయి మాధవ్, నాగ్ అశ్విన్..ల రైటింగ్ కూడా ఈ సినిమాకి హైలెట్ అయ్యింది అని చెప్పాలి. పురాణాల స్పూర్తితో ఇందులో చాలా సంభాషణలు లిఖించబడ్డాయి. లేట్ చేయకుండా వాటిని ఈ ఆర్టికల్లో చూసేయండి :

1)చంపడానికి వస్తే నన్ను చంపు కృష్ణ..!
కానీ నీ ఉపదేశాలు వినడానికి నేను అర్జునుడిని కాదు.!

2)ఈ 18 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన పాపాల కన్నా
నీ అధర్మం నిష్కృతి లేనిది.
ద్రోణాచార్యుడు పుత్రుడవై ఉండి ఇంతకి దిగజారాలా?

- Advertisement -

3)అశ్వద్ధామ..! దేవుడైనా ద్రోణుడైనా కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు.

4)చావు నీకు శిక్ష కాదు అశ్వద్ధామ.. అది నీకు విముక్తి

5)అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటైనప్పుడు
నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి
అలాంటి యుగంలో కలి ఎంత శక్తివంతుడు అంటే
నా పుట్టుకని కూడా ఆపగలడు.
అప్పుడు నువ్వే నా గర్భ గుడికి కాపలా కాయాలి

6) ఈ భూమ్మీద మొదటి నగరం
ఈ వరల్డ్ లో చివరి నగరం.. కాశీ

7)పైన ఎవరున్నారు?
వీటన్నిటికీ కారకుడు.. 200 ఏళ్ళ రాక్షసుడు.. సుప్రీమ్ యాస్కిన్

8)ఈ కాలంలో ఒక ప్రాణం మోయడమే పెద్ద వరం అమ్మ

9)నిజానికి నమ్మకంతో పని లేదు
సమయం వచ్చినప్పుడు నీ కళ్ళముందే కనిపిస్తుంది
ఈ కథలన్నీ నిజమని.. దేవుడు వస్తాడని.. నీకు తెలుస్తుంది

10)బుజ్జి చూశావా.. నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు..!
ఉన్నారులే..! రెబల్ ఫ్యాన్స్

11)ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలిచ్చినా
మనిషి మారడు మారలేడు

12) ప్రపంచంలో ఒకే ఒక్క సైడ్
నీ సైడ్.. సెల్ఫిష్ సైడ్

13)నీ లాంటోడు ఎంతమందిని రక్షించొచ్చో తెలుసా
నేను రక్షించాల్సింది…ఒక్కరినే

14)మీ యుద్ధం మళ్ళీ మొదలైనట్లుందే
ఇది యుద్ధం కాదు.. యుద్దానికి ముందు చేసే ఆయుధ పూజ

15)రికార్డ్స్ చూసుకో ఇప్పటివరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు..
ఇది కూడా ఓడిపోను..!

16)నువ్వు ప్రాణం ఇవ్వడానికి పుట్టావమ్మా.. ప్రాణం తీయలేవు

17)ప్రతి చావుకి ఒక పరమార్థం ఉంటుంది తల్లి

18)మోయగలిగే శక్తి ఉన్న వారికే మోసే బాధ్యత ఇస్తాడు ఆ భగవంతుడు
భగవంతుడిని కడుపులో మోయాలంటే భూదేవంత ఓపిక ఉండాలి
అది మీలో ఉంది కాబట్టే ఆ దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడు

19) భగవంతుడి లోపల సమస్త సృష్టి ఉంటుంది అంటారు
అలాంటిది మీ కడుపులో భగవంతుడే ఉన్నాడు

20)జన్మనివ్వడం మీ ధర్మం..
కాపాడటం నా బాధ్యత

21)ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను.. దా..!

22)ఆలస్యం అయ్యిందా .. ఆచార్య పుత్రా..!

23)అక్కడ నాలాంటి ఎంతో మందికి నువ్వు హీరోవి

24)చూశావా కేశవ.. తను నాకు సమానుడా?
తన అస్త్రానికి మన రథం కేవలం 2 అడుగులు వెనక్కి వెళ్ళింది
కానీ నా అస్త్రానికి అతని రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళింది

25)ఓ ధనుంజయా..!
నీ రథం అగ్నిదేవుని వరం
కాపాడుతున్నది జెండాపై కపిరాజు
నడుపుతున్నది ముల్లోకాల్ని నడిపించే నేను
అయినా 2 అడుగులు వెనక్కి తోసాడు అంటే ఆలోచించు అర్జునా

26)తను సామాన్య యోధుడు కాదు
తన కళ్ళల్లో సూర్య తేజస్సు
తన చేతిలో అలుపెరగని విజయ ధనుస్సు

27)తన పేరు చరిత్ర మర్చిపోడు
సూర్యపుత్ర వైకర్ధ… ‘కర్ణ’

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు